అరె బాబు… గుంటూరు కారం పై వస్తున్న రూమర్స్ అన్ని ఫేక్ అని మేకర్స్ ఎంత చెప్పినా నమ్మేదేలే అనే రేంజ్‌లో సోషల్ మీడియాలో కొత్త కొత్త పుకార్లు పుట్టుకొస్తునే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ నుంచి తమన్ ఔట్ అయ్యాడనే ప్రచారం జరిగింది. అలాగే హీరోయిన్ పూజా హెగ్డే కూడా సైడ్ అయిపోయిందని జోరుగా వినిపిస్తోంది. కానీ… ఇలాంటి వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగవంశీ. అంతేకాదు ఈ నెల 24 నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. అయినా కూడా గుంటూరు కారం పై రూమర్స్ ఆగడం లేదు. తాజాగా ఈ సినిమా కోసం మరో యంగ్ బ్యూటీని రంగంలోకి దింపారనే న్యూస్ వైరల్ అవుతోంది. ముందుగా ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా పూజా హెగ్డేను అనుకున్నారు. కొంత షూటింగ్ కూడా చేశారు. ఆ తర్వాత సెకండ్ లీడ్ కోసం శ్రీలీలను తీసుకున్నారు కానీ ఇప్పుడు పూజా హెగ్డేను తీసేసి మరో హీరోయిన్‌ను తీసుకున్నట్టు టాక్ నడుస్తోంది.
తెలుగులో త్రివిక్రమ్ బ్యాకప్ ఉన్న హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్‌ను పూజా ప్లేస్‌లోకి రిప్లేస్ చేసినట్టు తెలుస్తోంది. ‘భీమ్లా నాయక్’ సినిమాతో సంయుక్త మీనన్‌ను తెలుగు ఆడియెన్స్‌కు పరిచయం చేశాడు త్రివిక్రమ్. ఆ తర్వాత ‘సార్’లో ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఇటీవల వచ్చిన విరూపాక్ష మూవీతో గోల్డెన్ లెగ్‌గా మారిపోయింది సంయుక్త. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ ‘గుంటూరు కారం’లో పూజా హెగ్డే బదులుగా.. సంయుక్తను సెలెక్ట్ చేశారని సమాచారం. ఇదే నిజమైతే… ‘గుంటూరు కారం’లో శ్రీలీల ఫస్ట్ హీరోయిన్‌గా ప్రమోట్ అవనుంది. అయితే ఇలాంటి వార్తల్లో అసలు నిజముందా? అంటే లేదనే చెప్పాలి కానీ సినిమా అన్నాక ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. పైగా గుంటూరు కారం పై వస్తున్న పుకార్లు అన్నీ ఇన్ని కావు. అందుకే.. అసలు మ్యాటర్ ఏంటో తెలియాలంటే మేకర్స్ మరోసారి క్లారిటీ ఇవ్వాల్సిందే.