Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో ఎగువ నుండి నాగార్జునసాగర్ లోకి వరద ప్రవాహం. కొనసాగుతుంది. మొత్తం 26 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ ఫ్లో : 2,53,534 క్యూసెక్కులు కాగా… ఔట్ ఫ్లో : 2,69,622 క్యూసెక్కులు. ప్రస్తుత నీటిమట్టం : 585.30 అడవులు. పూర్తిస్థాయి నీటిమట్టం : 590 అడుగులు. ప్రస్తుత నీటి నిలువ సామర్థ్యం : 298.300 టీఎంసీలు. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం : 312.5050 టీఎంసీలు.
జయశంకర్ భూపాలపల్లి: మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు వరద ఉధృతి కొనసాగుతుంది. బ్యారేజ్ లో మొత్తం 85 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేపట్టారు. ఇన్‌ఫ్లో,ఔట్ ఫ్లో 3,30,830 క్యూసెక్కులు కొనసాగుతుంది.
మహబూబ్ నగర్: జూరాలకు వరద ప్రవాహం కొనసాగుతుంది. 39 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ఇన్ ఫ్లో : 2,75,015 వేల క్యూ సెక్కులు కాగా..
ఔట్ ఫ్లో : 2,84,853 వేల క్యూ సెక్కులు కొనసాగుతుంది.
నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు వరద కాస్త తగ్గుముఖం పట్టింది. ఇన్ ఫ్లో 9 వేల క్యూసెక్కులు కాగా.. పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు చేరింది. ప్రస్తుతం 1080 అడుగులు కొనసాగుతుంది. నీటి సామర్థ్యం 80 టిఎంసీలు కాగా.. ప్రస్తుతం 47 టిఎంసీలుగా కొనసాతుంది. ఔట్ ఫ్లో. 2167 వేల క్యూసెక్కులుగా ఉంది.
సంగారెడ్డి: బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు అప్డేట్.. ఇన్ ఫ్లో- 1445 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో- 391 క్యూసెక్కులు, పూర్తి స్థాయి నీటి సామర్థ్యం- 29.917 TMCలు, ప్రస్తుత నీటి సామర్థ్యం- 14.803 TMCలుగా కొనసాగుతుంది.
UPI Payments : ఇప్పుడు ఒకేసారి రూ. 5 లక్షల వరకు యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు