కాంగ్రెస్ టికెట్ వస్తుంది అని నమ్మకం ఉందని పాల్వాయి స్రవంతి అనడం ఇప్పడు చర్చనీయాంసంగా మారింది. 40 యేండ్ల నుండి పార్టీ కోసం పని చేస్తున్నానని గుర్తు చేసారు. పార్టీలు మరాతా అనే తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆవార్తలను ఆమె ఖండించారు. టీఆర్‌ఎస్ పార్టీలో ఇప్పటికే లోడ్ ఎక్కువైందని సంచళనవ్యాఖ్యలు చేశారు. బీజేపీ లోకి వెళ్ళేది లేదని స్పష్టం చేశారు. మునుగోడులో కుల రాజకీయాలు జరగలేదని తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలని అన్నారు. అధిష్టానం నిర్ణయం కోసం వేచి చూస్తానని పాల్వాయి స్రవంతి పేర్కొన్నారు.
read also: Karthikeya 2 Movie Review : కార్తికేయ -2 రివ్యూ
అయితే.. కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి నల్గొండ జిల్లాలో స్ట్రాంగ్ పవర్ సెంటర్ అయిన కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పుడు రెండు దారులయ్యారు. ఈనేపథ్యంలో.. ఒకరు కాంగ్రెస్ పార్టీలో వున్నా, లేనట్టే. ఇంకొకరేమో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో.. మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఖరారైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కృష్ణారెడ్డి బరిలోకి దిగే అవకాశం వుందన్న ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో.. ఇటీవల పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారధ్యంలో మునుగోడులో బల ప్రదర్శన తరహాలో బహిరంగ సభ నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ. ఈ సమావేశంలో కృష్ణారెడ్డి సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయిన విషయం తెలిసిందే.
అయితే.. గతంలో మునుగోడులో కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతికి టిక్కెట్ ఇవ్వాల్సి వచ్చినా.. ఆమెను కాదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల స్రవంతి త్యాగం వృధా అయ్యిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే అదే రేవంత్ రెడ్డి ఇప్పుడు కృష్ణారెడ్డిని రంగంలోకి దించుతున్నారనే ప్రచారం జరుగుతుండటంతో.. ఈ మొత్తం వ్యవహారంపై పాల్వాయి స్రవంతి ఓ కాంగ్రెస్ కార్యకర్తతో గోడు వెల్లగక్కారు. టీపీసీసీ రేవంత్ రెడ్డి ఇంకో పరాభవం కోరకుంటున్నారా.? అనే ప్రశ్నించినట్లు వార్తలు గుప్పు మంటున్నాయి. మరి దీనిపై రేవంత్ రెడ్డి ఎలా స్పందిచనున్నారో.. మునుగోడు బరిలో ఎవరన్నది ప్రశ్నార్థకంగామారింది.
PM Narendra Modi: మనమంతా “విజయోత్సవం” జరుపుకుంటున్నాం.. కామన్వెల్త్ గేమ్స్ విన్నర్స్ తో మోదీ
