Munugode bypoll 2022 last day election campaign: తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోన్న మునుగోడు ఉప ఎన్నికలో కీలక ఘట్టానికి తెరపడనుంది. నేటితో మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ముగయనుంది. సాయంత్రం 6గంటలకు ప్రచారానికి తెరపడనుంది. సాయంత్రం 6 గంటల నుండి ఎన్నికల ప్రచారం చేయకూడదని స్పష్టం చేశారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. ఇవాళ ప్రచారానికి చివరి రోజు కావడంతో.. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు ఎక్కువ మంది ఓటర్లను అభ్యర్థించేందుకు ప్రచారాన్ని నిర్వహించనున్నారు. టీఆర్‌ఎస్ తరుపున కేటీఆర్, హరీష్ రావ్ తోపాటు వేరు వేరుగా రోడ్ షోలు నిర్వహించనున్నారు. బీజేపీ కూడా భారీ ర్యాలీతో ముగించనుంది. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ , కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొననున్నారు. మహిళా అభ్యర్థిని బరిలోకి దింపిన కాంగ్రెస్ మహిళా గర్జన పేరుతో సభను నిర్వహించనుంది. అయితే ఈసభకు భారీ సంఖ్యలో మహిళలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది కాంగ్రెస్ ఈ సభకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు.
Read also: CPI Narayana US Tour: ఆ ఫోటోతో అమెరికాలో చేదు అనుభవం.. షాకైన నారాయణ
మరోవైపు మునుగోడు ఉప ఎన్నిక నిర్వహణకు ఎన్నికల కమీషన్ పకడ్బందీ చర్యలు తీసుకుంది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,41,000 ఓటర్లు ఉన్నారు. 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు. 105 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించామని తెలిపారు. మరోవైపు.. ఇప్పటి వరకు మునుగోడులో 185 కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు.. రూ.6.80 కోట్ల క్యాష్ సీజ్ చేశాం.. 4,683 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నాం.. రాజకీయ పార్టీల నాయకుల నుంచి కూడా వచ్చిన ఫిర్యాదులు కలుపుకుంటే 479 ఫిర్యాదులు వచ్చాయన్నారు. మునుగోడులో ప్రచారం ముగిసిన తర్వాత.. ప్రలోభాల పర్వం తెరలేసే అవకాశం ఉండడంతో.. ఎన్నికల సంఘం గట్టి నిఘా ఏర్పాట్లు చేస్తోంది.. ఇప్పటికే విచ్చలవిడిగా డబ్బులు పంచారని.. మద్యం ఏరులై పారుతుందనే ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి.. ప్రచారం ముగిసిన తర్వాత ఇది మరింత ఊపందుకునే అవకాశం లేకపోలేదు.. ఒకరిని ఒకరు దూషించుకుంటున్నా.. చిన్న చితక పార్టీలు మినహాయిస్తే.. ఎన్నికల బరిలో ఉన్న అన్ని పార్టీలు జోరుగా డబ్బులు పంచుతున్నాయని.. మద్యం పంచుతున్నాయని.. ప్రచారంలో పాల్గొన్నవారికి ఓవైపు మద్యం.. మరోవైపు నాన్‌వెజ్‌తో భోజనాలు పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.
Iran: మహ్స అమిని తరహాలోనే పోలీస్ కస్టడీలో ఇరాన్ సెలబ్రెటీ చెఫ్ హత్య..