Munugode By Election Results: నేడే ‘మునుగోడు’ ఉత్కంఠకు తెర.. 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Munugode By Election Results: నేడు మునుగోడు ఫలితాలు వెలువడనున్నాయి. మునుగోడు మొనగాడు ఎవరన్నాది నేటితో తెరపడనుంది. మునుగోడులో తమ జెండాపాతేందుకు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నిక ఫలితం నేడు రానుంది. ఈ ఎన్నికల్లో విజయంపై టీఆర్‌ఎస్, బీజేపీ, విశ్వాసం వ్యక్తం చేస్తుండగా.. అనూహ్య ఫలితాలు వస్తాయని కాంగ్రెష్ ఆశిస్తోంది. అసెంబ్లీ సమరానికి సెమీ ఫైనల్ గా భావించి నెలపాటు పోటాపోటీగా ప్రజక్షేత్రంలో ప్రచారం చేసి పార్టీలన్నీ అహర్నిశలు శ్రమించాయి. రికార్డు స్థాయి ఓటింగ్ లో ఈవీఎంలో తీర్పు నిక్షిప్తం కాగా ఫలితం పై అభ్యర్థులు, ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ తరఫున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి పోటీ చేశారు. నేడు మధ్యాహ్నానికల్లా విజేత ఎవరనే విషయంపై దాదాపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రధాన రాజకీయ పక్షాల్లో ఎడగెగని ఉత్కంఠ నెలకొంది.
Read also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
మునుగోడు నియోజకవరగ్ంలో 3న జరిగిన జరిగిన పోలింగ్ లో మొత్తం 2లక్షల 41వేల 805 మందికి గానూ, 2లక్షల 25వేల 192 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ అయిన అనంతరం ఈవీఎంలను నల్గొండ పట్టణంలోని ఆర్జాలబావి వద్ద ఉన్న వేర్ హౌసింగ్ గోడౌన్స్ లో స్ట్రాంగ్ రూంను ఏర్పాటు చేశారు. 298 పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్ల లెక్కింపు కోసం నల్గొండ పట్టణంలోని అర్జాలబావిలో ఉన్న వేర్ హౌసింగ్ గోడౌన్స్ లో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 21 టేబుల్స్ పై15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఒక్కో రౌండ్ లో 21 పోలింగ్ కేంద్రాల ఓట్లు లెక్కిస్తారు. ఉదయం 8గంటలకు పోలింగ్ ఏజెంట్లు, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌ను ఓపెన్ చేసి, పోలైన 686 పోస్టల్ బ్యాలట్ ఓట్లను కౌంట్చేస్తారు. తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు. మొదటి రౌండ్ ఫలితం ఉదయం 9 గంటలకు..చివరి రౌండ్ ఫలితం మధ్యాహ్నం 1గంట వరకు ప్రకటిస్తారు. మొదటగా చౌటుప్పల్, తర్వాత నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడెం, నాంపల్లి, గట్టుప్పుల్ మండలాల ఓట్లు లెక్కిస్తారు.
ఇక, కౌంటింగ్ లో పాల్గొనే సిబ్బందికి మూడు దఫాలుగా శిక్షణ ఇచ్చారు. జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కృష్ణా రెడ్డి, ఆర్ఓ రోహిత్ సింగ్, కేంద్రం నుంచి వచ్చిన ముగ్గురు పరిశీలకుల పర్యవేక్షణలో ఈ కౌటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఈనేపథ్యంలో.. ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్లను నియమించారు.ఈ సందర్భంగా.. కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు…స్ట్రాంగ్ రూమ్ వద్ద నిరంతరం సీఆర్పీఎఫ్ బలగాలు పహారా కాస్తున్నాయి. సీసీ కెమెరాల ద్వారా కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇక,కౌంటింగ్ కోసం ప్రతి పార్టీ నుంచి 21 మంది ఏజెంట్లను నియమించారు.
Kerala Boys Prank: ప్రాంక్ పేరుతో వెకిలి చేష్టలు.. బెండు తీసిన పోలీసులు
- Tags
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!