వర్షాకాలం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీలో ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాజకీయ కోణంతో రాష్ట్రాలను తొక్కేస్తున్నారని ఆరోపించారు. మొన్న కేంద్ర మంత్రి ఐటీఐఆర్ రద్దు చేశామని ప్రకటించారని, 46 వేల ఏకరాలు కేటాయించాలని అప్పుడు కోరారని, ఐటీఐఆర్ పెరిగితే చాలా లాభాలు ఉంటాయన్నారు. కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవటం సిగ్గు చేటని ఆయన మండిపడ్డారు. తెలంగాణా ఐటీ ఎక్స్ పోర్ట్ ఇప్పటికే ఎదుగుతోందని, ముందే ఐటీఐఆర్ వచ్చి ఉంటే మరింత అభివృద్ధి జరిగేదని ఆయన అన్నారు.
ఐటీఐఆర్‌ను రద్దు చేసినందుకు మరో ప్రాజెక్టు తెలంగాణ కు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు ఏం ఇవ్వొద్దు అనుకుంటున్నారని, మీరు అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని, ఉత్తమ్ రాష్ట్రంలో అప్పుల గురించి మాట్లాడారు.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ బెటర్. కాగ్ రిపోర్ట్ లను పరిశీలించాలని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రం అప్పులే 90 శాతం వరకు ఉన్నాయని, ఎఫ్‌ఏసీఏ కే లక్షల కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉందని, ఉత్తమ్ తెలంగాణ ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. లిమిట్స్ లొనే తెలంగాణ అప్పులున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఏది చెప్పి చేయడని, సర్ప్రైజ్ ఉంటుందన్నారు.