పార్లమెంటులో ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే ఎంపీలను సస్పెండ్ చేయడం దారుణం అన్నారు టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు (nama nageswara rao). ప్రజల ఓట్లతో తో పార్లమెంట్ కు వచ్చిన సభ్యులను రెండు సభల నుండి సస్పెండ్ చేయడం ఎప్పుడూ జరగలేదన్నారు నామా. భద్రాద్రిలో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యలను చర్చల్లో ప్రస్తావిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి బిజెపి ప్రభుత్వానిదే …అందుకే సస్పెండ్ చేస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన బీజేపీ ఎంపీలు గోదావరి వరద బాధితులపై ఎందుకు నోరు మెదపడం లేదని ఎంపీ నామా ప్రశ్నించారు. తెలంగాణకు రావాల్సిన న్యాయమైన హక్కులు ,నిధులు గురించి బీజేపీ ఎంపీ లు ఒక్క రోజైన పార్లమెంటులో మాట్లాడేందుకు ఎందుకు వెనకంజ వేస్తున్నారు. ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాట బిజెపి నాయకులకె చెల్లుతుంది. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజా సమస్యలపై వారు తోక ముడచటం తప్ప తమ వాణిని వినిపించిన దాఖలాలు లేవు.
కష్టాల్లో ఉన్న ప్రజలను సీఎం కేసీఆర్ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ రాష్ట్ర అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక బిజెపి ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం సహాయంతో పాటు రాజ్యసభ సభ్యుడు పార్థసారధి రెడ్డి కోటి రూపాయలు వెచ్చించి పినపాక నియోజకవర్గ వరద బాధితులకు నిత్యావసరాలు అందించడం అభినందనీయం అన్నారు ఎంపీ నామా నాగేశ్వరరావు.
Common Wealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ బోణీ.. వెయిట్ లిఫ్టింగ్‌లో తొలి పతకం