Viral: తన చిలిపి చేష్టలతో వృద్ధుడికి ముచ్చెమటలు పట్టించిన కోతి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనేకమార్లు కోతి చేష్టలు మనకి కోపం తెప్పిస్తే.. మరికొన్నిసార్లు మాత్రం తెగ నవ్వును తెప్పిస్తాయి. మరికొన్ని సార్లైతే మాత్రం ఆశ్చర్యం కూడా కలిగిస్తుంటాయి. మనుషులపై ముఖ్యంగా తిను పదార్థాల కోసం దాడులు చేసే సమయాలలో కోతులను చూశాం., అంతే కాదండోయ్.. మన ఇళ్లలోకి కొన్నిసార్లు వచ్చి ఖరీదైన వస్తువులను ఎత్తుకెళ్లే కోతులను కూడా చూసే ఉంటాము. ఇది ఇలా ఉండగా కొన్నిసార్లు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా కూడా చేస్తాయి.
Read Also: Viral: రొమాంటిక్ మూడ్ లోకి వచ్చిన గుర్రం.. చివరికి ఆమె చేసిన పనికి షాక్..!
Also Read
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
తాజాగా ఇలాంటి ఓ విచిత్ర ఘటన సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ కోతి స్కూటీపై కూర్చుని ఓ వృద్ధుడికి ముచ్చెమటలు పట్టించింది. వృద్ధుడి స్కూటీ ఎక్కి దిగనంటే దిగనంటూ అంటూ చేసిన నిర్వాకం చూసి అంతా అవక్కయ్యారు. ఇకపోతే ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పురిలో చోటు చేసుకుంది. ఓ వృద్ధుడు స్కూటీ పై కూర్చుని ఉండగా.. అక్కడికి అనుకోకుండా ఓ కోతి వస్తుంది. ఆ కోతి వచ్చీ రాగానే.. ఒక్కసారిగా పైకి ఎగిరి స్కూటీ హ్యాండిల్ పై కూర్చుంటుంది. ఈ దెబ్బతో ఆ వృద్ధుడు మొదట భయపడిపోతాడు. ఆ కోతి ఎక్కడ తన పై కూడా దాడి చేస్తుందోనని భయపడతాడు.
Read Also: BRS Aroori Ramesh: ఆరూరి రాజీనామా ప్రకటన.. హనుమకొండలో పొలిటికల్ హై డ్రామా..
కాకపోతే ఆ కోతి అతన్ని ఏమీ చేయకుండా ఆయన కళ్లద్దాలను లాక్కుంది. ఈ సంఘటనతో వృద్ధుడు కూడా పైకి నవ్వుతూ.. ‘‘అద్దాలు తీసుకోవద్దు.. పగిలిపోతాయ్.. ఇవ్వు ’’.. అంటూ వాటిని తీసుకుంటాడు. ఆపై కోతి వృద్ధుడి తలపై చేతులు పెట్టి అతడి వైపే చూస్తుంది. దాంతో ఆ వ్యజతి కూడా కోతితో స్నేహంగా మాట్లాడతాడు. ఆ సమయంలో కోతిని అక్కడి నుంచి పంపించేందుకు.. బిస్కట్లు తెప్పించాలని ట్రై చేస్తాడు. అయినా కానీ కోతి మాత్రం పక్కకు వెళ్లకుండా అతడి వైపే చూస్తూ ఉంది. ఇలా కొద్ది సేపు కోతి స్కూటీ పైనే కూర్చుని ఉంది. ఈ వీడియోకు గాను నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ కోతి బలే తమాషాగా ఉందే.. అంటూ ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!