IPL 2024: డబ్బు కోసమే ఐపీఎల్ ఆడటం సరికాదు.. హార్దిక్ పాండ్యాపై భారత మాజీ పేసర్ ఫైర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Praveen Kumar Slams on Hardik Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. మార్చి 22న ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ సీజన్ ద్వారా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా ముంబై జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. ముంబైకి ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో గాయపడిన హార్దిక్.. కోలుకుని ప్రాక్టీస్ చేస్తున్నాడు. దాదాపు నాలుగు నెలల పాటు మైదానానికి దూరంగా ఉన్న హార్దిక్.. ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది.
వన్డే ప్రపంచకప్ 2023 అనంతరం హార్దిక్ పాండ్యా దేశవాళీ, జాతీయ జట్టుకు ఆడకుండా నేరుగా ఐపీఎల్‌లో ఆడడంపై టీమిండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. డబ్బు సంపాదన ముఖ్యమే అని, అందులో తప్పు ఏమీ లేదు కానీ తొలుత రాష్ట్రం, దేశం కోసం ఆడితే బాగుంటుందన్నాడు. ఓ ఇంటర్వ్యూలో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ… ‘గత రెండు నెలల్లో హార్దిక్ పాండ్యా క్రికెట్ ఆడలేదు. జాతీయ జట్టు, దేశవాళీ టోర్నీల్లోనూ బరిలోకి దిగలేదు. నేరుగా ఐపీఎల్‌లోనే ఆడేందుకు సిద్దమవుతున్నాడు. దీనిని ఎలా చెప్పాలో తెలియడం లేదు. డబ్బు సంపాదన ముఖ్యమే. అందులో తప్పు ఏమీ లేదు. కానీ ముందుగా రాష్ట్రం, దేశం కోసం ఆడితే బాగుంటుంది’ అని అన్నాడు.
Also Read
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
- Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
Also Read: Bjp Candidate List 2024: నేడు బీజేపీ రెండో జాబితా.. 90 మంది అభ్యర్థులు ఖరారు!
‘ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఐపీఎల్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. జాతీయ జట్టు, ఐపీఎల్ ఏది ముఖ్యమంటే.. రెండూ కీలకమే అని నేను చెబుతా. డబ్బు కోసమే ఐపీఎల్ ఆడటం సరికాదు. ఏ ఆటగాడైనా దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా భావించాలి. కానీ కొందరి ఆటగాళ్లలో ఆ భావన ఉండటం లేదు. ఐపీఎల్ ఆడడం కోసం ఒక నెల ముందు విశ్రాంతి తీసుకుని.. సిద్ధమవుతున్నారు. అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు ఐపీఎల్‌కు సమాన ప్రాధాన్యం ఇస్తే బాగుంటుంది. ఫ్రాంచైజీ క్రికెట్‌ను వదిలేయమని నెందు చెప్పడం లేదు కానీ జాతీయ జట్టుకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి’ అని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!