ఆ నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలి : ఎంపీ కోమటిరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించకడానికి సీఎం కేసీఆర్, కేటీఆర్, డమ్మీ హోం మంత్రి మహమూద్ అలీ, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ రాకపోవడం దారుణం అని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నిందితుడిని పట్టిస్తే 10లక్షలు ఇస్తామని ప్రకటించడం హాస్యాస్పదం అని తెలిపారు. చిన్నారి మృతికి ఆ రాక్షసుడు ఎంత కారణమో పోలీసులు అంతే కారణం. తల్లి పిర్యాదు చేసిన వెంటనే డోర్ ఓపెన్ చేసిఉంటే అమ్మాయి బ్రతికి ఉండేది. కేటీఆర్ ప్రచారాల మంత్రి. బతుకమ్మ అంటూ తెలంగాణ అంత తిరిగే కవిత ఇక్కడికి ఎందుకు రాలేదు. మానవత్వం ఉంటె కేటీఆర్ ఇక్కడికి రావాలి. దళిత గిరిజన బిడ్డలని రాలేదా, కేటీఆర్ సమాధానం చెప్పాలి. వెంటనే దోషులను శిక్షించాలి అని కోరారు.
పోలీసులకు అవార్డు వస్తున్నాయని గొప్పలు చెప్పుకుంటున్నారు, డబ్బులతో అవార్డులు కొనుక్కుంటున్నారు. దోషులను పట్టుకోకపోవడం పోలీస్ వ్యవస్థ చేతకానితనానికి నిదర్శనం. అమ్మాయి చనిపోయి బాధలో ఉంటె జిల్లా కలెక్టర్ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పడం బాధాకరం. చదువుకున్న కలెక్టర్ మాట్లాడే మాటలా ఇవి. సినీ యాక్టర్ ని పరామర్శించే తలసాని శ్రీనివాస్ ఇక్కడికి ఎందుకురారు. ఆయన అసలు మంత్రేనా అని ప్రశ్నించారు. దిశ టైంలో చేసినట్లే చిన్నారి విషయంలో కూడా వెంటనే నిందితులను శిక్షించాలి అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.
Also Read
- Harish Rao : 5,420 కోట్ల 'ట్రూ అప్' భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
- Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
- Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
తాజావార్తలు
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!