BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
- ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’
- పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
- సీజేపీని టార్గెట్ చేసిన బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ విపక్షాలు, కాక్రోచ్ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ యువమోర్చా.. సీజేపీని లక్ష్యంగా చేసుకుంది. ‘‘కాక్రోచ్ కాదు.. మచ్చర్ అవ్వండి’’ అంటూ ఫ్లైదుబాయ్ విమాన కెప్టెన్ స్మిచ్ మచ్చర్ ఫొటోతో కూడిన పోస్టర్లు పూణెలో వెలిశాయి. ప్రస్తుతం ఈ పోస్టర్లు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ పోస్టర్లు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఆందోళనలను లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ ఫ్లైట్ FZ1073లో తీవ్ర ఘటన చోటుచేసుకుంది. విమానం మధ్యలో ఉన్న సమయంలో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై కో-ఫైలట్ దాడికి తెగబడ్డాడు. తీవ్రంగా గాయపడినప్పటికీ మచ్చర్ కాక్‌పిట్ తలుపును తెరవగలిగారు. దీంతో ఆఫ్-డ్యూటీ పైలట్లు, సిబ్బంది, ప్రయాణికులు జోక్యం చేసుకుని విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటనపై అమెరికా ప్రతినిధుల సభలో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను సత్కరించేందుకు తీర్మానం ప్రవేశపెట్టారు. ఫ్లైట్‌పై జరిగిన దాడిని ఆ తీర్మానంలో ‘ఉగ్రవాద చర్య’గా ఖండించారు.
Also Read
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
- Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు వాటిలోని పద ప్రయోగాన్ని ప్రశంసించగా.. మరికొందరు మాత్రం పైలట్ సాహసాన్ని రాజకీయ ప్రచారానికి ఉపయోగించడం సరికాదని విమర్శించారు. ఒక వర్గం వ్యక్తులు వ్యక్తిగత ధైర్యసాహసాలను రాజకీయంగా ఉపయోగించవద్దని అభిప్రాయపడగా.. మరికొందరు పోస్టర్లలో బీజేపీ లోగో ఉండటంతో వాటి రాజకీయ ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. మరోవైపు కొందరు సోషల్ మీడియా వినియోగదారులు ఈ వ్యవహారంపై సరదాగా స్పందించారు. ‘మచ్చర్లు అయితే రాజకీయ నాయకులు పారిపోవాల్సి వస్తుంది’ అంటూ కూడా పోస్టులు పెట్టారు.
ఇదిలా ఉండగా.. CJP చీఫ్ స్పోక్స్‌పర్సన్ సౌరవ్ దాస్ అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఎన్నికల సంఘం, ముఖ్య ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌పై తమ డిమాండ్లను వినిపించేందుకు ఈ ఆందోళన చేపడుతున్నట్లు CJP నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా SIR ప్రక్రియకు సంబంధించిన ఆరోపణలు, ఎన్నికల సంఘంలో సంస్కరణలు, జ్ఞానేశ్ కుమార్ రాజీనామా వంటి అంశాలను వారు ప్రస్తావిస్తున్నారు. అక్టోబర్ 7న సౌరవ్ దాస్ ఢిల్లీ పోలీసులకు నిరసనపై అధికారికంగా సమాచారం ఇచ్చినట్లు తాజా నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఢిల్లీ పోలీసులు ఆ నిరసనకు అనుమతి నిరాకరించినట్లు కూడా వార్తలు వచ్చాయి.
అక్టోబర్ 10 నిరసనకు దేశవ్యాప్తంగా యువత తరలిరావాలని CJP నేతలు పిలుపునిచ్చారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసినా ఎన్నికల సంఘంలో సంస్కరణల కోసం తమ పోరాటం కొనసాగుతుందని సౌరవ్ దాస్ పేర్కొన్నారు. ‘దిల్లీ చలో’ నినాదంతో కార్యకర్తలను ఢిల్లీకి రావాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో ఒకవైపు CJP నిరసనలకు సిద్ధమవుతుండగా.. మరోవైపు పుణెలో బీజేపీ యువమోర్చా ఏర్పాటు చేసిన ‘మచ్చర్ వర్సెస్ కాక్రోచ్’ పోస్టర్లు రాజకీయ చర్చకు దారితీశాయి.
A lot of roads in Pune are covered with interesting posters. https://t.co/pHAy282dad
— Naveen (@NAVofNav) October 4, 2026
- Tags
- bjp
- BJP posters
- Pune
తాజావార్తలు
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!