MLC Kcitha: ప్రశ్నించడం తెలంగాణ రక్తంలో ఉందని.. ప్రశ్నించకపోతే ఏమీకాదని ఎం.ఎల్.సి. కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా విద్యార్థులు, కొత్త ఓటర్లతో ఎమ్మెల్సీ కవిత ఇంటరాక్షన్ లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. రాబోయే యుగం యువతదే అన్నారు. ప్రజా స్వామ్యంలో ఓటు అత్యంత శక్తి మంతమైందన్నారు. ఓటు వేయకపోతే అడిగే హక్కును కోల్పోతారని అన్నారు. పట్టణాల్లో తక్కువగా పోలింగ్ అవుతుందని.. గ్రామాల్లో ఓటింగ్ పెరుగుతుందని అన్నారు. ఎన్నికలు అంటే ఆషామాశిగా తిసుకోవద్దని సూచించారు. సోషల్ మీడియా ద్వారా తమ సమస్యలను ప్రశ్నించాలని పిలుపు నిచ్చారు. ప్రశ్నించడం తెలంగాణ రక్తంలో ఉందని అన్నారు. ప్రశ్నించకపోతే ఏమీకాదని అన్నారు. ఎన్నికలు అనగానే ఒక బ్రమ్మ పదార్థం మాకు సంబంధం లేదు అనే ఆలోచన నుంచి విద్యార్థులు బయటకు రావాలని అన్నారు.
Read also: Mahmood Ali: తప్పుడు మాటలు హామీలు నమ్మితే.. తెలంగాణ అభివృద్ధి ఆగిపోయే ప్రమాదం ఉంది
దేశానికి వ్యాపారం పేరుతో వచ్చిన ఆంగ్లేయులు దేశ ప్రజల స్వేచ్ఛను హరించారని తెలిపారు. ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం ఇండియా అని తెలిపారు. యువత తమ వాయిస్ ను వినిపించేందుకు సోషల్ మీడియాను వినియోగించుకోవాలని అన్నారు. తప్పుడు ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే , దేశ యువతకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. సైనికులు బార్డర్ లో యుద్ధం చేస్తున్నారు.. యువత ఇక్కడ నిలబడి ఓటు వేయలేరా.? అని ప్రశ్నించారు. దేశం అభివృద్ధి జరగాలంటే.. యువత ఓటింగ్ లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మన ప్రజాస్వామ్యం ఎంత బలంగా ఉంటే దేశం అంత బలంగా మారుతుందని అన్నారు. మహిళలు బాధ్యత యుతంగా ఆలోచిస్తారని కవిత అన్నారు.
Chain Snatcher: అప్పులు భరించలేక.. చైన్ స్నాచర్‌గా మారిన జాతీయ స్థాయి క్రీడాకారుడు