MLC Kavitha: బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై రాష్ట్ర విభజన చట్టంలోనే ఉంది..
- బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉంది..
- కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న చట్టాన్ని మాత్రం అమలు చేయాల్సిందే..
- 10 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న బీజేపీ హామీని అమలు చేయడం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. “బయ్యారం ఉక్కు – తెలంగాణ హక్కు” అంటూ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రాకముందే 2013 లోనే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు కేసీఆర్ లేఖ రాశారని కవిత గుర్తు చేశారు. లక్షా 41 వేలకు పైగా ఎకరాల్లో 300 మిలియన్ టన్నులకు పైగా ఐరన్ ఓర్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. అక్కడ ఉక్కు పరిశ్రమ వస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు పెరుగుతాయి అన్నది కేసీఆర్ ఆలోచన అన్నారు.
Read also: MS Dhoni: ఎంఎస్ ధోనీ లాంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేదు: ఐపీఎల్ యజమాని
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్సీఏ ఏమంటోంది.?
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉందని గుర్తుచేశారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న చట్టాన్ని మాత్రం అమలు చేయాల్సిందే అన్నారు. 10 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న బీజేపీ హామీని అమలు చేయడం లేదని తెలిపారు. కేటీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఐరన్ ఓర్ నాణ్యత నేపథ్యంలో ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని బీజేపీ ప్రభుత్వం సాకు చూపిస్తోందన్నారు. ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కావడానికి అవసరమైన మరో 100 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ ను ఛత్తీస్ ఘడ్ నుంచి తీసుకువచ్చేందుకు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కేసీఆర్ మాట్లాడారని తెలిపారు.
Read also: Chamala Kiran Kumar Reddy: రాహుల్ కు కేటీఆర్ లేఖ.. హాస్యాస్పదమన్న చామల..
బీజేపీకి తెలంగాణ పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి, ప్రేమ ఉన్నా తక్షణమే బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కాదని పార్లమెంటు సాక్షిగా తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడం బాధాకరం అని కవిత అన్నారు. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఒక్కరు కూడా స్పందించకపోవడం శోచనీయం అన్నారు. ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో ఎంపీగా ఉన్న సమయంలో ఉక్కు పరిశ్రమ కోసం డిమాండ్ చేశారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు మాత్రం మాట్లాడటం లేదన్నారు. బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు చేయించాలని కవిత డిమాండ్ చేశారు.
Bengaluru Techie: పురుషుల రక్షణకు కూడా చట్టాలు కావాలి.. లేదంటే కోర్టులపై నమ్మకం పోతుంది!
తాజావార్తలు
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!