MLC Kavitha: నన్ను అనే మాటలు మీ ఇంట్లో ఆడవాళ్లను అంటే మీరు పడుతారా? అంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ పై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. అరవింద్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ఆవేదన చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్న ఆమెను అక్కడ వచ్చిన మహిళలు అరవింద్ గురించి చెప్పారని మండిపడ్డారు. నన్ను అనే మాటలు మీ ఇంట్లో ఆడవాళ్లను అంటే మీరు పడుతారా? అని ప్రశ్నించారు. ఈ మాటలు కరెక్ట్ కాదని ఆమె తెలిపారు. ఎంపీ ధర్మపురి అరవింద్ తన బాధ్యతలను విస్మరించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడరని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు ఓ విజ్ఞప్తి చేస్తున్నా.. ఈరోజు నిజామాబాద్ ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. నేను ఆడబిడ్డను.. మీ అమ్మాయిల మాటకు మీరు ఏకీభవిస్తారా? నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి… సీఎం కేసీఆర్ బిడ్డను కాబట్టి.. నన్ను ఆదరిస్తారా అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఇలాంటి రాజకీయాలకు తావులేదన్నారు. మంగళవారం రాత్రి జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆమె మాట్లాడారు. నిజామాబాద్‌లో ఓడిపోయిన తర్వాత హుందాగా రాజకీయాలు చేసి గెలిచిన వ్యక్తికి పని చేసే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే నోరు మెదపకుండా కార్యక్రమాలు చేశానని గుర్తు చేశారు. కానీ ఎంపీగా తనపై గెలిచిన అరవింద్ మాత్రం తన బాధ్యతను విస్మరించి వ్యక్తిగతంగా పలుమార్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రజా జీవితంలో ఉండి ప్రజలకు ఏ పనీ చేయకుంటే ప్రశ్నించడంలో తప్పులేదు కానీ నువ్వు చనిపోతే 20 లక్షలు.. మీ అన్న చనిపోతే పది లక్షలు.. . మీ తండ్రి. . తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో కూడా ఆంధ్రా పాలకులపై ఇలాంటి అమర్యాద మాటలు మాట్లాడలేదని, అప్పుడు కూడా ఆంధ్రా పాలకులను పాయింట్ల వారీగా ప్రశ్నించారు. ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని దురుసుగా ప్రవర్తించే రాజకీయాలను ప్రోత్సహించవద్దని తెలంగాణ ప్రజలను అభ్యర్థించినట్లు తెలిపారు. ఇదేనా మీ సంస్కృతి అరవింద్? అని నిలదీశాడు.
Chhattisgarh Assembly Election: అమిత్ షాపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్