Rahul Gandhi: తెలంగాణాలో రాహుల్ బస్సు యాత్ర.. ములుగులో కాంగ్రెస్ బహిరంగ సభ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోకి దిగుతుంది. ఇందుకోసం బస్సు యాత్రలు చేసేందుకు రెడీ అయింది. బస్సు యాత్రను ప్రారంభించేందుకు జాతీయ స్థాయి నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తెలంగాణకు రానున్నారు. మూడు రోజుల పాటు.. 8 నియోజకవర్గాల్లో సాగే ఈ బస్సు యాత్రలో రాహుల్ పర్యటించనున్నారు. ఈ యాత్రలో నిరుద్యోగులు, సింగరేణి కార్మికులు, పసుపు.. చెరుకు రైతులు, మహిళలతో ఆయన సమావేశం కానున్నారు. ఇవాళ స్పెషల్ ఫ్లైట్ లో రాహుల్, ప్రియాంక సాయంత్రం 3:30 గంటలకు బేగంపేట్ విమానాశ్రయం చేరుకోనున్నారు.
బస్సు యాత్ర షెడ్యూల్ ఇదే..!
Also Read
* ఇవాళ మధ్యాహ్నాం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు.
* బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో రామప్ప ఆలయానికి ఈ ఇద్దరు కాంగ్రెస్ నేతలు చేరుకోనున్నారు.
* రామప్ప టెంపుల్లో రాహుల్, ప్రియాంక ప్రత్యేక పూజలు చేయనున్నారు.
* సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ బస్సు యాత్రను ఈ అన్నాచెల్లెళ్లు ప్రారంభించనున్నారు.
* రామప్ప గుడి నుంచి కాంగ్రెస్ బస్సు యాత్ర ములుగు చేరుకోనుంది.
* అక్కడ నిర్వహించే బహిరంగ సభలో మహిళలతో రాహుల్, ప్రియాంకా ప్రత్యేకంగా భేటీ అవుతారు.
* ములుగు సభ తరువాత తిరిగి ఢిల్లీకి ప్రియాంక గాంధీ వెళ్లిపోతారు.
* ములుగు బహిరంగ సభ నుంచి భూపాలపల్లికి బస్సు యాత్ర చేరుకొనుంది.
* భూపాలపల్లిలో నిరుద్యోగ యువతతో కలిసి రాహుల్ గాంధీ ర్యాలీ నిర్వహిస్తారు. రాత్రికి.. భూపాలపల్లిలోనే ఆయన బస చేస్తారు.
19న షెడ్యూల్..
* 19వ తేదీన భూపాలపల్లి నుంచి కాటారం కి చేరుకోనున్న బస్సు యాత్ర
* కాటారం పాదయాత్రలో రాహుల్ గాంధీతో పాటు పిసిసి రేవంత్ రెడ్డిచ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇతర ముఖ్య నేతలు
* మంథని నుంచి పెద్దపల్లి వెళ్లనున్న బస్సు యాత్ర
* పెద్దపల్లి నుంచి కరీంనగర్ కు బస్సు యాత్ర
* కరీంనగర్ లో నైట్ హాల్ట్ చేయనున్న రాహుల్ గాంధీ
20న షెడ్యూల్..
* ఎల్లుండి 20వ తేదీన కరీంనగర్ నుంచి బోధన్ ఆర్మూరు మీదుగా నిజామాబాద్ వరకు కాంగ్రెస్ బస్సు యాత్ర కొనసాగనుంది.
* బోధన్ లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని రాహుల్ గాంధీ సందర్శించనున్నారు.
* ఆర్మూరులో కాంగ్రెస్ బహిరంగ సభ జరుగనుంది.
* పసుపు.. చెరుకు రైతులతో రాహుల్ ప్రత్యేకంగా సమావేశం అవుతారు.
* నిజామాబాద్ లో పాదయాత్రలో పాల్గొంటారు. దీంతో 20వ తేదీ సాయంత్రం తో టీ కాంగ్రెస్ బస్సుయాత్ర మొదటి విడత ముగియనుంది.
CM KCR: నేడు జడ్చర్ల, మేడ్చల్‌కు కేసీఆర్.. బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రసంగించనున్న సీఎం
తాజావార్తలు
-
Prabhas – Nbk : ప్రభాస్ ఫౌజీ – బాలయ్య ‘దాదా’లకు OTT సంస్థల స్ట్రిక్ట్ కండిషన్స్
-
BRS MLC Tata Madhu Arrest: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్..
-
Pakistan Match Fixing: పాకిస్థాన్ జట్టులో మరోసారి ఫిక్సింగ్ కలకలం.. ఆ ఇద్దరు స్టార్ క్రికెటర్ల ఫోన్లు స్వాధీనం!
-
Nora Fatehi Defamation Case: ‘టాయ్ ప్లేన్’ అంటూ వీడియోలు.. ఐటమ్ భామ నోరా ఫతేహిపై రూ.3 కోట్ల పరువు నష్టం కేసు!
-
BSNL దూకుడు.. జియో, ఎయిర్‌టెల్‌కు షాక్..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!