MLC Kavitha: బీసీల గురించి మాకు రాహుల్ చెప్పాల్సిన అవసరం లేదని ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. నిజామాబాద్ జిల్లా బోధన్ లో పర్యటనలో వున్న కవిత మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై మండిపడ్డారు. గత పదేళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని అన్నారు. సాగు, తాగు నీటికి ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. మహిళా బీడీ కార్మికులకు సౌభాగ్య పథకం వర్తింపజేస్తామన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో చూసి ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయిందని అన్నారు. మా పార్టీ బలంగా ఉంది కాబట్టే మోడీ, రాహుల్, ప్రియాంక ఇక్కడ ప్రచారానికి వస్తున్నారని తెలిపారు. బీసీల గురించి మాకు రాహుల్ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మాది బీసీ ప్రభుత్వం.. రాహుల్ గాంధీ కాదు ఎన్నికల గాంధీ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులను సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా ఆదుకుంటున్నారన్నారు. రైతు బంధు 16 వేలకు పెంచుతాం. బీజేపీ, కాంగ్రెస్ నేతలు టూరిస్ట్ లీడర్లని విమర్శించారు. రాష్ట్రంలోని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎన్నికల వాతావరణాన్ని చెడగొట్టవద్దని సూచించారు. నీటి ఛార్జీలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.
బీసీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. బీఆర్‌ఎస్ అంటే బీసీల ప్రభుత్వమని స్పష్టం చేశారు. వేలాది గురుకుల పాఠశాలలను నెలకొల్పిన ఘనత బీఆర్‌ఎస్‌దేనన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు బీఆర్‌ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా నిలిచిందన్నారు. సీఎంలను మార్చేటప్పుడు గొడవలు సృష్టించడం కాంగ్రెస్‌కు అలవాటు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రగతికి నిదర్శనం. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అమలు చేస్తున్న పథకాలను బీజేపీ కాపీ కొడుతుందని ఆరోపించారు. 65 ఏళ్లలో కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందో చెప్పాలి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే తరాలు మారాలని తెలిపారు. కేవలం మూడేళ్ళలో తాము కాళేశ్వరం నిర్మించామన్నారు. నిజాంసుగర్ ఫ్యాక్టరీ సంక్షోభానికి టిడిపి, కాంగ్రెస్ లే కారణం అంటూ మండిపడ్డారు. పదేళ్లలో ఎక్కడా మతకలహాలు లేవని, మతకలహాల చరిత్ర కాంగ్రెస్ ది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana Congress: బీఆర్ఎస్ కు షాక్ .. కాంగ్రెస్ లో శేరిలింగంపల్లి కార్పొరేటర్ దంపతులు