MLC Kavitha: ఎంఎస్పీ ఇస్తారా? లేదా బోనస్ ఇస్తారా? స్పష్టత ఇవ్వాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha:వేరుశనగ రైతుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కనీస మద్ధతు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలిపారు. ఎంఎస్పీ ఇస్తారా లేదా బోనస్ ఇస్తారా అన్నదానిపై స్పష్టత ఇవ్వాలన్నారు. శాసన మండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేకంగా ప్రస్తావించారు. వేరుశనగ రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఆ పంటకు కనీస మద్ధతు ధర కల్పించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. ఇవాళ కౌన్సిల్ లో ఈ అంశాన్ని కవిత ప్రత్యేకంగా ప్రస్తావించారు. సీఎం సొంత జిల్లా అయిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న జడ్చర్ల, అచ్చంపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్లలో వేరశనగ రైతులు తీవ్ర ఆందోళన చేస్తున్నారని తెలిపారు.
ఆ పంటకు క్వింటాలుకు రూ. 6377 కనీస మద్ధతు ధర ఉండగా… వ్యాపారస్తులు సిండికేట్ అయ్యి రూ. 5 వేలలోపు కొనుగోలు చేస్తున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. రైతులను వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పంటలకు కనీస మద్ధతు ధర కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. వేరుశనగ పంటకే కాకుండా అన్ని పంటలకు కనీస మద్ధతు ధర కంటే తక్కువ ధర ఉంటే రూ. 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని, కాబట్టి కనీస మద్ధతు ధర కల్పిస్తారా లేదా బోనస్ ఇస్తారా అన్న విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, వేరుశనగ రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
Read also: True Lover : ఓటీటీ లోకి రాబోతున్న ఎమోషనల్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సచివాలయ ఆవరణలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచించాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ అంశాన్ని సభలో లేవనెత్తేందుకు శాసనమండలి చైర్మన్ అనుమతి కోరారు. సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఆ స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సరికాదన్నారు. రాజీవ్ గాంధీ దేశానికి ఆయన చేసిన సేవలకు మనకు ఎనలేని గౌరవం ఉంది. కానీ తెలంగాణకు తెలంగాణ తల్లి చాలా ముఖ్యం. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రభుత్వం గౌరవించాలని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Uttarpradesh : 258 సార్లు ఫోన్‌లో మాట్లాడిండు.. ప్రపోజ్ చేస్తానని పిలిచి ఆగం చేసిండు
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..