రేవంత్ రెడ్డికి సుధీర్‌రెడ్డి వార్నింగ్.. లోపలికి పోతావ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి గెలిచి.. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు, కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ తారాస్థాయికి చేరుకుంది.. రాళ్లతో కొట్టడం, ఉరికించి కొట్టడం, చెప్పుల దండలు.. ఇలా ఇప్పుడు లోపల(జైలు)కి పోతావ్ అంటూ వార్నింగ్ ఇచ్చేవరకు వచ్చింది.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. టి.పీసీసీ చీఫ్ రేవంత్‌పై విరుచుకుపడ్డారు.. ఈ నెల 7వ తేదీ తర్వాత ఎవరు ఏం చేస్తారో తెలుస్తుందన్న ఆయన… రేవంత్ గూండాల మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలో ఎవరూ మిగలరు అని వ్యాఖ్యానించారు.. ప్రచారం కోసం రేవంత్ బజారు భాష మాట్లాడుతున్నారని విమర్శించిన ఆయన.. నీ బెదిరింపులకు భయపడం.. రేవంత్ కంటే ఎక్కువ ఉరికించి కొట్టించగలం అని హెచ్చరించారు.
రేవంత్ రెడ్డి గూండాయిజం చేస్తానంటే లోపలకి పోతావు అంటూ వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. రేవంత్ ఒక బ్రోకర్ అంటూ హాట్ కామెంట్లు చేశారు.. సీఎల్పీ మా అబ్బా సొత్తు కాదు.. రేవంత్ అబ్బాసొత్తు కాదు అని సెటైర్లు వేసిన ఆయన.. మేం సీఎల్పీని విలీనం చేసినట్లు ఎప్పుడూ చెప్పలేదన్నారు.. ఒక గ్రూప్ ఎమ్మెల్యేలం టీఆర్ఎస్‌లో విలీనం అయ్యామని తెలిపిన సుధీర్‌రెడ్డి.. లింగోజిగూడలో మేం పోటీ నుంచి తప్పుకున్నాం.. ఒక వేళ పోటీ చేస్తే మేమే గెలిచేవాళ్లమన్నారు.. మరోవైపు.. రేవంత్ ఎంపీగా ప్రజలకు ఎప్పుడైనా అందుబాటులో ఉన్నాడా? అని ప్రశ్నించారు సుధీర్.. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రేవంత్ ప్రజలకు ఏమైనా సహాయం చేసారా ? అని నిలదీశారు.. 2017లో రాజీనామా చేసినప్పుడు స్పీకర్ కు రేవంత్‌రెడ్డి రాజీనామా ఎందుకు ఇవ్వలేదని.. ఎన్నికలకు ఎందుకు వెళ్లలేదని ఫైర్ అయ్యారు.
Also Read
- Pawan Kalyan: రేపు హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
- Shiv Charan Reddy: 'నన్ను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు'.. మనసులు నొప్పించి ఉంటే క్షమించండి: శివచరణ్ రెడ్డి
- Shabad Six-Murder Case: షాబాద్ ఆరుగురి హత్య కేసు.. రాజ్‌కుమార్‌పై భార్య కుటుంబం సంచలన ఆరోపణలు!
- Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్‌పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
తాజావార్తలు
-
Posani Krishna Murali: ‘మా నాన్న కూలీ.. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు’: పోసాని కృష్ణమురళి
-
IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
-
Venkatesh Maha: రంగస్థలం నేను రాసిన కథ: డైరెక్టర్ వెంకటేష్ మహా
-
Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
-
Pawan Kalyan: రేపు హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!