MLA Seethakka: కేటీఆర్ ఆ మాటను బేషరతుగా వెనక్కు తీసుకోవాలి.. సీతక్క డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Seethakka Demands KTR To Take A Word Back: ములుగు నియోజకవర్గ ప్రజలు సీతక్కను గెలిపించి తప్పు చేశారంటూ మంత్రి కేటీఆర్ తప్పుడు మాటలు మాట్లాడారని.. ఆయన ఆ మాటను బేషరతుగా వెనక్కు తీసుకోవాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. తనని ఇంతలా ఎందుకు టార్గెట్ చేస్తున్నారో నియోజకవర్గ ప్రజలు ఓసారి ఆలోచించాలని కోరారు. ములుగు జిల్లా కేంద్రంలోని MLA- క్యాంప్ కార్యాలయం వద్ద నిర్హించిన ప్రెస్మీట్లో సీతక్క మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా కేటీఆర్ కూడా పని చేశారని, అప్పుడు మిమ్మల్ని గెలిపించి ప్రజలు తప్పు చేశారని ఏనాడైనా కాంగ్రెస్ పార్టీ అన్నదా? అని ప్రశ్నించారు. మమ్మల్ని గెలిపించి తప్పు చేశారని అంటే.. మిమ్మల్ని గెలిపించి కూడా ప్రజలు తప్పు చేసినట్టేనని మేము అన్నామా? అని అడిగారు.
Baba Vanga: భూమిపై అణు విపత్తు.. సౌర తుఫానుల తప్పవా..? భయపెడుతున్న బాబా వంగా జ్యోతిష్యం
Also Read
నియోజకవర్గ ప్రజలే తన బలం, కుటుంబమని భావించి తాను పని చేస్తున్నానని సీతక్క పేర్కొన్నారు. ఏ పార్టీ వాళ్లు తన గడప తొక్కినా.. ఎవరు ఫోన్ చేసినా.. తాను అందరినీ ఒకేలా చూస్తున్నానని అన్నారు. ఎప్పుడు ప్రజల్లో తిరగనివాళ్లు.. ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో, మీ అభ్యర్థులమనే రూపంలో కొంతమంది ప్రచారం చేస్తున్నారని చురకలంటించారు. గంగిరెద్దుల్లాగా ఎవరు వస్తున్నారనేది రాష్ట్ర ప్రజలకు తెలుసని కౌంటర్ వేశారు. ఏనాడూ జిల్లా పర్యటనలు పెట్టని సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో పర్యటనలు పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. అవి మీకే తగులుతాయని.. మాకు తగలవని శాపం పెట్టారు. కాబట్టి.. కేటీఆర్ ఆ మాటని వెనక్కి తీసుకోవాలని, ఇది కరెక్ట్ కాదని అన్నారు. అవసరం కోసం ప్రజల్లోకి వచ్చి, మొఖం చూపించిపోయే వాళ్లను గెలిపించుకోవాలనే మీ కుట్రలు, కుతంత్రాలు.. ములుగు నియోజకవర్గ ప్రజలు సహించరన్నారు.
MLC Kavitha: తెలంగాణ పథకాలను అన్ని రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి
ఈరోజు బీఆర్ఎస్ నాయకులు తనని టార్గెట్ చేశారని, ఏ రకంగా ఇబ్బందులు పెట్టదలచుకున్నారో తాను ప్రశ్నిస్తున్నానని సీతక్క విరుచుకుపడ్డారు. తమని ఎవరెన్ని తిట్టినా.. వినతి పత్రాల్లో ములుగు నియోజకవర్గానికి తాము అడిగిన డిమాండ్లను పూర్తి చేయాలని అడుగుతున్నామన్నారు. గోదావరి జలాలు, ఏటూరునాగారాన్ని రెవిన్యూ డివిజన్, మంగపేట ప్రాంతంలో ఓ బీఈడీ కాలేజీ, పెసర కేంద్రంగా నర్సింగ్ కాలేజీ వంటి డిమాండ్లను పూర్తి చేయాలన్నారు. అలాగే.. ములుగులో ప్రకటించిన మెడికల్ కాలేజీని వెంటనే ప్రారంభించాలని, ట్రైబల్ యూనివర్సిటీ తరగతుల్ని త్వరగా ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాకు గతంలో ఇచ్చిన హామీల్ని వెంటనే నెరవేర్చాలన్నారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!