Raja Singh: నా లైఫ్ డేంజర్ లో ఉంది.. IGకి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raja Singh బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఎందుకు మార్చడం లేదని ఇంటలిజెన్స్ IGకి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. కొత్త వెహికిల్ ఇవ్వడానికి సీఎం కేసీఆర్ అనుమతి అడుగుతున్నారా? లే అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా ? అని రాజాసింగ్ ప్రశ్నించారు. టెర్రరిస్టులు, యాంటీ సోషల్ యాక్టీవిస్ట్ లు తనపై దాడి చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. తన లైఫ్ డేంజర్ లో ఉందని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు రాజాసింగ్. కొత్త బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్ కేటాయించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
ఇంటెలిజెన్స్ అధికారులు తనకిచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం మీద ఎమ్మెల్యే రాజాసింగ్ సోమవారం రాజాసింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.. ఉగ్రవాదుల నుంచి తనకు ముప్పు పొంచి ఉందని తెలిసి కూడా తరచూ మరమ్మత్తులకు గురయ్యే వాహనాన్ని తమకు ఇచ్చారంటూ ఆయన మండిపడ్డారు. కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు తనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారని, అది 4 నెలల క్రితం రోడ్డు మధ్యలోనే ఆగిపోయిందని వాపోయారు. అప్పుడు తాను ఆ వాహనాన్ని ఇంటెలిజెన్స్ కార్యాలయానికి తిరిగి పంపించానన్నారు. మరమ్మత్తులు చేసి మళ్లీ అదే వాహనాన్ని ఇచ్చారని, 2 నెలల క్రితం నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లే సమయంలో కూడా అది ఆగిపోయిందని పేర్కొన్నారు. ఆ టైంలో గన్‌మెన్ల సాయంతో తనని ఆటోలో కోర్టుకు తీసుకెళ్లారని గుర్తు చేశారు. ఇక అఫ్జల్‌గంజ్ వద్ద కూడా ఆ వాహనం మరోసారి ఆగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో మరోదారి లేక, తన సొంత వాహనాన్నే రప్పించుకొని వెళ్లానన్నారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న తనకు.. ఇంటెలిజెన్స్ అధికారులు ఇలాంటి వాహనం ఇస్తారా? అని రాజాసింగ్ అసహనం వ్యక్తం చేశారు. కండీషన్‌లో లేని వాహనంలో తనకు ఏమాత్రం భద్రత ఉంటుందనే విషయాన్ని తాను పోలీసు అధికారులు దృష్టికి గతంలో చాలాసార్లు తీసుకెళ్లినా.. అధికారులు స్పందించలేదని ఆయన ఆవేదన చెందారు.
Also Read
- Schools Closed: విద్యార్థులకు అలర్ట్.. నేడు పాఠశాలలు బంద్..
- Rain Forecast: మరో గంటలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..
- Fire Accident: పాతబస్తీలో అగ్నిప్రమాదం.. క్షణాల్లో వ్యాపించిన పొగ.. భయాందోళనలో ప్రజలు..
- CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
పీడీ యాక్ట్ కేసులో ఇటీవల బైలుపై రాజాసింగ్ జైలు నుంచి రిలీజైన సంగతి తెలిసిందే! ఎలాంటి ప్రెస్‌మీట్‌లు ఇవ్వకూడదని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టరాదని, ర్యాలీలు కూడా నిర్వహించకూడదన్న షరతులతో ఆ బైలుని మంజూరు చేసింది. స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ షోను హైదరాబాద్‌లో నిర్వహించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ.. రాజాసింగ్ ఒక వీడియోని విడుదల చేశారు. అది ఓ వర్గానికి చెందిన వ్యక్తుల మనోభావాలను దెబ్బతీయడంతో, దేశవ్యాప్తంగా దుమారం రేగింది. అప్పుడు విద్వేష వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేశారు. దీనికి సవాల్ చేస్తూ రాజాసింగ్ సతీమణి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ని విచారించిన కోర్టు.. వాదోపవాదనలు విన్నాక షరతులతో కూడిన బెయిల్‌ని రాజాసింగ్‌కి మంజూరు చేసింది.
Shraddha Walkar Case: శ్రద్ధా హత్య కేసులో కీలకంగా మారిన “వాటర్ బిల్”..
తాజావార్తలు
-
Infinix Hot 70 Pro 5G: భారత్ లో విడుదల కానున్న ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో.. 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సూపర్ ఫీచర్స్
-
Awarapan 2: ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి.. బుల్లెట్ ట్రైన్ లా దూసుకెళ్తున్న ‘అవరాపన్ 2’
-
Dhanush Digital : ధనుష్ సోషల్ మీడియా IT వింగ్.. పొలిటికల్ ఎంట్రీ కోసమేనా?
-
Psychology Facts: రిలేషన్ ముగిసిపోయిందని తెలిసినా.. మనసు ఎందుకు అంగీకరించదు?
-
AP Assembly 2026: నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు.. పలు కీలక అంశాలపై చర్చ!
ట్రెండింగ్
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్‌ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
10,000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, IP69 రేటింగ్‌తో iQOO Z11S వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!