Aaftab Poonawala’s water bill shows how he kept the murder hidden: ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యంత క్రూరంగా తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధా వాకర్ అనే 27 ఏళ్ల యువతిని అఫ్తాబ్ పూనావాలా చంపేశాడు. శరీరాన్ని 35 ముక్కలుగా చేసి ఓ ఫ్రిజ్ లో దాచి పెట్టాడు. 18 రోజుల పాటు రాత్రి 2 గంటల ప్రాంతంలో ఢిల్లీ చుట్టుపక్కట ప్రాంతాల్లో పారేశాడు. ఈ కేసు దేశంలో సంచలనంగా మారింది. హత్య జరిగిన ఆరు నెలల తర్వాత శ్రద్ధా తండ్రి కేసు పెట్టడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన వీరు ఢిల్లీలోని మెహ్రౌలి ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ అద్దెకు సహజీవనం చేస్తున్నారు. ఆ అపార్ట్మెంట్ లోకి మారిన మూడు రోజుల్లోనే మే 18న శ్రద్ధా వాకర్ని హత్య చేశాడు.
ఇదిలా ఉంటే ఈ కేసులో సాక్ష్యాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. ఇప్పటికే నిందితుడు అఫ్తాబ్ ఇచ్చిన సమాచారం మేరకు ఛత్తార్ పూర్ అటవీ ప్రాంతంలో శ్రద్ధావిగా చెప్పబడుతున్న 10 బస్తాల ఎముకలను సేకరించారు. దీంతో పాటు అఫ్తాబ్ ప్లాట్ లోని ఫ్రిజ్ తో పాటు కిచెన్ లో దొరికిన రక్తపు నమూనాలను సేకరించారు. వీటిని ఫోరెన్సిక్ ల్యాబుకు పంపి.. శ్రద్ధా తండ్రి డీఏఎన్ఏతో పోల్చనున్నారు.
Read Also: Dog Saved Owner’s Life: యజమాని కోసం ప్రాణాలు అర్పించిన కుక్క
ఇదిలా ఉంటే ప్రస్తుతం మరో కీలక ఆధారం పోలీసుల ముందుకు వచ్చింది. అదేంటంటే..అఫ్తాబ్ అపార్మ్టెంట్ వాటర్ బిల్. శ్రద్ధా హత్య తరువాత అఫ్తాబ్ ప్లాట్ లో ఒంటరిగా ఉంటున్నాడు. అయితే ఒంటరిగా ఉన్నప్పటికీ రూ. 300 వాటర్ బిల్లు వచ్చింది. అయితే రూ.300 చిన్న విషయమే అయినప్పటీకీ ఇదే ఇప్పుడు కీలకంగా మారనుంది. ఢిల్లీ ప్రభుత్వం ప్రతీ ఇంటికి నెలకు 20,000 లీటర్ల నీటిని ఉచితంగా అందిస్తుంది. దీనికి మించి నీటిని వాడితే బిల్లును విధిస్తుంది. అయితే ఒక్కడే ఉంటున్న అపార్ట్మెంట్ కు రూ.300 వాటర్ బిల్లు ఎందుకు వచ్చిందనే దానిపై పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు.
అయితే హత్య జరిగిన తర్వాత రక్తపు మరకలు, ఆధారాలు చెరిపేయడానికి అఫ్తాబ్ ఎక్కువగా నీటిని వాడినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ముక్కలు నరికే క్రమంలో శబ్ధం రాకుండా కుళాయిలను తిప్పి ఉంచేవాడని తెలుస్తోంది. రక్తాన్ని వేడినీటితో కడగడానికి ఎక్కువగా వాటర్ వాడినట్లు తెలుస్తోంది. ప్రతీ ఇంటికి 20,000 లీటర్లు అంటే రోజుకు 35 బకెట్లు అంటే ఒక సగటు కుటుంబానికి సరిపోతుంది. అయితే పోలీసులు ఈ వాటర్ బిల్లు సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు.
హత్య జరిగిన మే 18 నుంచి ప్లాట్ లో అప్తాబ్ ఒక్కడే ఉంటున్నాడు. హత్య జరిగిన తర్వాతి రోజు అంటే మే 19న కొత్త ఫ్రిజ్ కొనుగోలు చేశాడు. శ్రద్ధా అకౌంట్ నుంచి రూ. 54,000 డ్రా చేసినట్లు వివరాలను సేకరించారు పోలీసులు. ప్రస్తుతం హత్యకు ఉపయోగించిన ఆయుధం, శ్రద్ధా మొబైల్ ఫోన్ కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు.