Raghunandan Rao: రేప్ కేసులో ట్వీస్ట్.. ఎమ్మెల్యే కొడుకు ఫోటోలు, వీడియో రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో మైనర్ బాలిక పై గ్యాంగ్ రేప్ ఘటనలో నగరానికి చెందిన ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఉన్నారని మొదటి నుంచి ఆరోపణలు వస్తున్నవిషయం తెలిసిందే.. అయితే పోలీసులు మాత్రం ఎమ్మెల్యే కొడుకు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. కాని తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన విషయాలు చెప్పారు. ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు గ్యాంగ్ రేప్ ఘటనలో ఉన్నారంటూ.. అందుకు కొన్ని ఆధారాలు చూపించారు. ఆమ్నేషియా పబ్ కు వచ్చిన మెర్సిడేజ్ బెంజ్ కారులో ఎమ్మెల్యే కొడుకు ఉన్న ఫోటోలను రఘునందన్ రావు విడుదల చేశారు. ఈ కారులోనే నిందితులు పబ్ కు వచ్చారని వెస్ట్ జోన్ డీసీపీ తెలిపారు. ఈ కారులోనే ఎమ్మెల్యే కొడుకు పబ్ కు వస్తున్న ఫోటోలను రఘునందన్ రావు లైవ్ లో రిలీజ్ చేయడం కలకలం రేపుతోంది.
ఈ ఘటనపై బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. పోలీసుల బెదిరింపులకు ఎవరు భయపడేవారు లేరన్నారు ..మమ్మల్ని కాదు తప్పు చేసిన వారిని భయపెట్టండన్నారు. సీసీ ఫుటేజ్ ఏది..ఎందుకు బయటపెట్టడం లేదని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా మాట్లాడితే కేసులు పెడతామంటున్నారన్నారు. నిందితులను ఇప్పటికే దేశం దాటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాంగ్ రేప్ చేసిన వారిని ఎందుకు సీక్రెట్ గా దాస్తున్నారని మండిపడ్డారు. నిర్భయ కేసులో మైనర్ల పేర్లు బయటకు వస్తున్నాయి.. మరి నిందితుల ఫోటోలు ఎందుకు చూపించడంలేదని ఆయన ప్రశ్నించారు. అసలు ఈ కేసులో నిందితులు మైనరా.. మేజరా.. అన్నది కాదని మండిపడ్డారు. పోలీసులు నిందుతులను బహిరంగంగా అరెస్టు చేసినట్లు ఎక్కడా రాలేదని నిప్పులు చెరిగారు. పోలీసులకు భయపడేవారు ఎవరూ లేరు అన్నారు. ఎందుకు వారిని సీక్రెట్ గా ఉంచుతున్నారని రఘనందన్ ప్రశ్నించారు. అవసరమైతే టీఆర్ఎస్ వాళ్లును రిమాండ్ చేస్తారు కానీ ఎంఐఎంను ఎందుకు చేయరు అని అన్నారు. ఈ కేసులో నిందితులెవరో తెలుసుకోవాలనుకుంటున్నామని ఆయన డిమాండ్ చేశారు.
Also Read
- Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
- Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
తాజావార్తలు
-
Japan vs India: హమ్మయ్య.. బయటపడ్డ భారత్.. పసికూన జపాన్‌పై తృటిలో తప్పిన ఓటమి!
-
BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
ట్రెండింగ్
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!