Hyderabad: కొడుకు కావాలి, కూతుళ్లు వద్దంటూ మెసేజ్‌లో ట్రిపుల్ తలాక్.. పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ సైదాబాద్‌లో ఒక భర్త తన భార్యకు ఫోన్ మెసేజ్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పిన ఘటన వెలుగులోకి వచ్చింది. తనకు కొడుకు కావాలని, కూతుళ్లు వద్దంటూ భార్యకు సందేశం పంపి విడాకులు ప్రకటించాడు. సైదాబాద్ లోకాయుక్త కాలనీకి చెందిన నిషాంత్ ఆఫ్రీన్ (37)కు, మలక్‌పేట సలీంనగర్‌కు చెందిన మహమ్మద్ అతి అర్ఫత్ (40)తో 2015 ఆగస్టులో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో కొంతకాలంగా వీరి మధ్య వివాదాలు నడుస్తున్నాయి, వీటికి సంబంధించి కేసులు కూడా నమోదయ్యాయి.
ఈ క్రమంలో గత నెల 24న భర్త మహమ్మద్ అతి అర్ఫత్ తన భార్యకు ఫోన్ చేసి, డిసెంబర్‌లోగా తనపై ఉన్న కేసులన్నింటినీ వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. కేసులు వెనక్కి తీసుకోకపోతే నిన్ను వదిలేస్తానంటూ హెచ్చరించాడు. ఆ మరుసటి రోజే “నువ్వు నాకు నచ్చడం లేదు.. నాకు కొడుకు కావాలి, కూతుళ్లు వద్దు” అని పేర్కొంటూ, మూడు సార్లు తలాక్ చెబుతూ భార్యకు విడాకుల సందేశం పంపాడు. భర్తతో పాటు తన అత్త సహనా బేగం, ఆడపడుచు అరియా ప్రేరేపించడం వల్లే భర్త ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడని ఆరోపిస్తూ బాధితురాలు నిషాంత్ ఆఫ్రీన్ సైదాబాద్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Also Read
- Ather Konarc EV: తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు.. నెలలోనే 83 శాతం పెరిగిన అమ్మకాలు.! ఎందుకింత డిమాండ్?
- Global Peace Honors: 'గ్లోబల్ పీస్ హానర్స్'లో తారల సందడి.. సచిన్‌కు ప్రత్యేక గౌరవం..!
- Road Accidents: దేవుడి దర్శనం కోసం వెళ్లి మృత్యుఒడిలోకి.. ఒకే రాత్రి 12 మంది మృతి, 21 మందికి గాయాలు
- Koti Deepotsavam 2026 Day 9: కోటి దీప యజ్ఞంలో నేడు మరో విశేష ఘట్టం.. కంచి కామాక్షి మహాభిషేకం, మీనాక్షి కల్యాణం!
తాజావార్తలు
-
Hyderabad: కొడుకు కావాలి, కూతుళ్లు వద్దంటూ మెసేజ్‌లో ట్రిపుల్ తలాక్.. పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
-
Ather Konarc EV: తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు.. నెలలోనే 83 శాతం పెరిగిన అమ్మకాలు.! ఎందుకింత డిమాండ్?
-
Global Peace Honors: ‘గ్లోబల్ పీస్ హానర్స్’లో తారల సందడి.. సచిన్‌కు ప్రత్యేక గౌరవం..!
-
Tom Latham Record: బుమ్రా దెబ్బ.. కివీస్ కెప్టెన్ ఖాతాలో చెత్త రికార్డు.. సెహ్వాగ్‌ను దాటేశాడు!
-
Road Accidents: దేవుడి దర్శనం కోసం వెళ్లి మృత్యుఒడిలోకి.. ఒకే రాత్రి 12 మంది మృతి, 21 మందికి గాయాలు
ట్రెండింగ్
-
IND vs NZ Test: టీమిండియా బ్యాటర్ల ఊచకోత.. భారీ ఆధిక్యంలో భారత్..!
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!