Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్‌
  • Web Stories
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Vice President Of India
  • Common Wealth Games
  • Parliament Monsoon Session
  • Heavy Rains
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Telangana News Mla Jagga Reddy Satyagraha Deeksha Against Ed Cases

MLA Jagga Reddy: రాజకీయ హత్యలు చేసిన ఘనత బీజేపీది

Published Date :July 26, 2022
By Abdul khadar
MLA Jagga Reddy: రాజకీయ హత్యలు చేసిన ఘనత బీజేపీది

MLA Jagga Reddy Satyagraha Deeksha Against ED Cases: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై ఈడీ కేసులకు నిరసనగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపై విరుచుకుపడ్డారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీని దూరం చేయడమే బీజేపీ ప్లాన్ అని, అందుకే కావాలని కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు. గుజరాత్‌లో అమిత్ షా, ప్రధాని మోదీ క్రిమినల్ కేసులున్నాయని.. కానీ కాంగ్రెస్‌లో ఉన్న వారు క్రిమినల్స్ కాదని అన్నారు. మోదీ, అమిత్ షా రాజకీయ, మత హత్యలు చేయించారని.. రాజకీయ హత్యలు చేసిన ఘనత బిజెపిది అని ఆరోపించారు.

అన్ని శాఖలను అదుపులో పెట్టుకొని, కాంగ్రేస్‌పై బీజేపీ కుట్ర పన్నుతోందని జగ్గారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని ప్రజల మధ్యకు వెళ్లకుండా.. ఈడీ ఆఫీస్‌ల చుట్టూ తిప్పాలని బిజెపి ప్లాన్ చేస్తోందన్నారు. చిన్న చిన్న కారణాలతో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ఇబ్బంది పెడుతున్నారని.. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా అడ్డదారులు తొక్కుతోందని ఆగ్రహించారు. ఈ విచారణకు నిరసనగా శాంతియుతంగా ధర్నా చేస్తుంటే.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలను అరెస్ట్ చేస్తున్నారని.. ఇది నిజంగా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నేషనల్ హెరాల్డ్ పత్రికతో బీజేపీకి ఏం సంబంధం ఉందని ఆయన నిలదీశారు. ఆ పత్రిక స్వాతంత్రం కోసం పని చేసిందని.. అప్పట్లో బ్రిటీష్ వాళ్లు ఏం చేస్తున్నారన్న విషయాల్ని, రహస్యాల్ని యావత్ దేశానికి ఆ పత్రిక తెలియజేసిందని పేర్కొన్నారు.

అలాంటి చరిత్ర కలిగిన ఈ పత్రికలో కామ, ఫుల్‌స్టాప్స్ లేకపోయినా.. వాటిని తప్పుగా ఈడీ చూపిస్తోందని జగ్గారెడ్డి వెల్లడించారు. 75 సంవత్సరాల తర్వాత ఈడీ కేసు నమోదు చేయడం హాస్యాస్పదమన్నారు. ఇంతకుముందు రాహుల్ గాంధీని, ఇప్పుడు సోనియా గాంధీని గంటల తరబడి ఈడీ ప్రశ్నిస్తోందని.. ఇది ఏమాత్రం సబబు కాదని నిలదీశారు. సోనియా, రాహుల్ సామాన్య పౌరులుగా జీవితం గడుపుతున్నారని.. గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. సైనికుల్లాగా తామంతా పని చేస్తామని జగ్గారెడ్డి చెప్పారు.

  • Tags
  • MLA Jagga Reddy
  • National Herald case
  • PM Narendra Modi
  • Rahul Gandhi ED
  • Sonia Gandhi ED

WEB STORIES

Chikoti Praveen:  చికోటి ప్రవీణ్‌..? ఆసక్తికరమైన విషయాలు..!

"Chikoti Praveen: చికోటి ప్రవీణ్‌..? ఆసక్తికరమైన విషయాలు..!"

ప్రపంచంలోని 10 ఎత్తైన విగ్రహాలు

"ప్రపంచంలోని 10 ఎత్తైన విగ్రహాలు"

Badam Tea: బాదం టీతో ఎన్నో లాభాలు

"Badam Tea: బాదం టీతో ఎన్నో లాభాలు"

Dulquer Salmaan: హీరో కాకపోయుంటే డ్రైవర్ని అయి ఉండేవాడిని

"Dulquer Salmaan: హీరో కాకపోయుంటే డ్రైవర్ని అయి ఉండేవాడిని"

Naga Chaitanya: నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు?  చిరాకేస్తుంది

"Naga Chaitanya: నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు? చిరాకేస్తుంది"

ఏయే పండ్లలో ఎంత షుగర్ ఉంటుందంటే..?

"ఏయే పండ్లలో ఎంత షుగర్ ఉంటుందంటే..?"

యాలకులు రోజూ తీసుకుంటే.. ఎన్నో లాభాలు

"యాలకులు రోజూ తీసుకుంటే.. ఎన్నో లాభాలు"

పీఎం కిసాన్‌లో మీ పేరు ఉందా?.. ఇలా తెలుసుకోండి?

"పీఎం కిసాన్‌లో మీ పేరు ఉందా?.. ఇలా తెలుసుకోండి?"

భారతీయులు నమోదు చేసిన 10 వింత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్

"భారతీయులు నమోదు చేసిన 10 వింత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్"

‘బ్యూటీ’ విటమిన్-‘ఈ’ వల్ల ఇన్ని ప్రయోజనాలా..

"‘బ్యూటీ’ విటమిన్-‘ఈ’ వల్ల ఇన్ని ప్రయోజనాలా.."

RELATED ARTICLES

Mamata Banerjee: ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయిన మమతా బెనర్జీ

Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిర ప్రారంభం అప్పుడే.. 40 శాతం పూర్తయిన పనులు

Mamata Benerjee: దిల్లీ పర్యటనలో బెంగాల్ సీఎం.. నేడు ప్రధానితో భేటీ

Rahul Gandhi: నేష‌న‌ల్ హెరాల్డ్ కేసు.. భయపడేది లేదు..

Srilanka Economic Crisis: మోదీ నాయకత్వంలోని భారత్ మాకు ప్రాణం పోసింది.. శ్రీలంక అధ్యక్షుడి కృతజ్ఞతలు

తాజావార్తలు

  • Governor Tamilisai: బాసరలో గవర్నర్‌ పర్యటన.. ట్రిబుల్‌ ఐటీ క్యాంపస్‌ పరిశీలన

  • Israel Strikes: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు.. 24కు చేరిన మృతుల సంఖ్య

  • Astrology: ఆగస్టు 7, ఆదివారం దినఫలాలు

  • SSLV D1: మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైన శ్రీహరికోట.. నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న తొలి ఎస్ఎస్ఎల్వీ

  • Lightning Strike: చమురు నిల్వ కేంద్రంలో పిడుగు.. 80 మందికి గాయాలు, 17మంది మిస్సింగ్

ట్రెండింగ్‌

  • Vice President Salary: ఉప రాష్ట్రపతి ఎంత వేతనం అందుకుంటారు? ఎలాంటి సదుపాయాలు లభిస్తాయి?

  • KCR Press Meet: రేపటి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా: సీఎం కేసీఆర్

  • Amazon Great Freedom Sale : అదిరిపోయే ఆఫర్స్‌.. టీవీలపై భారీ డిస్కౌంట్‌..

  • WhatsApp : 22 లక్షల భారతీయుల అకౌంట్లు బ్లాక్‌..

  • OnePlus 10T : తొలిసారిగా 16జీబీ ర్యాంతో వ‌న్‌ప్ల‌స్ 10టీ

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions