Harish Rao: ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది.. కేసీఆర్ సర్జరీ పై హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పరామర్శించేందుకు ఎవరూ ఆస్పత్రికి రావద్దని మాజీ మంత్రి హరీశ్‌రావు అభిమానులకు విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాగా, కేసీఆర్‌ను పరీక్షించిన వైద్యులు తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కేసీఆర్ ఇవాళ సాయంత్రం తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోనున్నారు. కేసీఆర్ కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుందని హరీశ్ రావు అన్నారు. సర్జరీ సమయంలో ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఎవ్వరూ ఆస్పత్రికి రావద్దని కోరుతున్నానని తెలిపారు. కేసీఆర్ కు విశ్రాంతి అవసరమన్నారు.
Read also: Vijay Rashmika: విజయ్-రష్మికల రిలేషన్ పై ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో క్లారిటీ!
Also Read
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
కేసీఆర్ ను చూసేందుకు కార్యకర్తలు, అభిమానులు ఎవ్వరూ ఆస్పత్రికి రావద్దని కోరుతున్నానని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. దురదృష్టవ శాత్తు జరిగిన ప్రమాదానికి పెద్ద శస్త్రచికిత్స అవసరమవుతుందని తెలిపారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ కుటుంబ సభ్యులతో పాటు ప్రార్థిస్తున్నామని తెలిపారు. దీనిపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్ కూడా తెలిపిన విషయం తెలిసిందే. ఇక మరోవైపు కేసీఆర్ ఆరోగ్యంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ గాయం గురించి విని చాలా బాధపడ్డానని తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి తుంటి ఎముకకు గాయమైందని తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నాను. వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
— G Kishan Reddy (@kishanreddybjp) December 8, 2023
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!