Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన కాంబినేషన్ చర్చనీయాంశంగా మారింది. విలక్షణ కథాంశాలతో కోలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, తాజాగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఒక ప్రాజెక్ట్ గురించి చర్చించినట్లు ఫిలింనగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. చిరంజీవి ఇమేజ్, ఆయన బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా కార్తీక్ ఓ పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకుని మెగాస్టార్‌ను కలిశారు. దాదాపు రెండున్నర గంటల పాటు ఏకధాటిగా సాగిన ఈ కథా చర్చల్లో దర్శకుడు సీన్ టు సీన్ పూర్తిస్థాయిలో వివరించినట్లు సమాచారం. సాధారణంగా చిరంజీవికి కథ నచ్చితే వెంటనే స్పష్టత ఇస్తుంటారు. అయితే, ఇంత సమయం నరేషన్ విన్న తర్వాత కూడా మెగాస్టార్ తన నిర్ణయాన్ని వెంటనే వెల్లడించకుండా ‘పెండింగ్’లో పెట్టడమే ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
కార్తీక్ సుబ్బరాజ్ టేకింగ్ అంతా డార్క్ హ్యూమర్, రా అండ్ రస్టిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాల చుట్టూ తిరుగుతుంది. ‘పేట’ వంటి చిత్రాల్లో రజనీకాంత్‌ను వింటేజ్ స్టైల్లో చూపిస్తూనే తనదైన శైలిని జోడించారు. అయితే తెలుగు ప్రేక్షకులు మెగాస్టార్ నుంచి కోరుకునే రెగ్యులర్ మాస్ అంశాలు, కమర్షియల్ హంగులతో పోలిస్తే కార్తీక్ సుబ్బరాజ్ ఆలోచనలు కాస్త భిన్నంగా ఉంటాయి. కథలోని వైవిధ్యం మెప్పించినప్పటికీ, కార్తీక్ మార్క్ ‘కల్ట్ అండ్ డార్క్’ నెరేషన్ తెలుగు మాస్ ఆడియన్స్‌కు ఏ మేరకు కనెక్ట్ అవుతుందనే సందేహమే చిరంజీవిని ఆలోచనలో పడేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో కొన్ని ప్రయోగాల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని, చిరంజీవి ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నారా లేక స్క్రిప్ట్‌లో కమర్షియల్ మార్పులు ఏమైనా కోరనున్నారా అనేది ఇప్పుడు సినీ ప్రియుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. కార్తీక్ సుబ్బరాజ్ విజన్‌కు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
Also Read
- Mythri Ravi: "రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు"
- Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
- Sidharth - Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
- Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
తాజావార్తలు
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!