Site icon NTV Telugu

Balka Suman : బీజేపీ దొంగల ముఠాగా తయారైంది

Balka Suman

Balka Suman

మరోసారి బీజేపీ నేతలపై, కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దద్దమ్మలా మాట్లాడుతున్నారంటూ విమర్శలు చేశారు. ప్రభుత్వాలను పడగొట్టడంలో బీజేపీ కున్న శ్రద్ధ ప్రజలను ఆదుకోవడంలో లేదంటూ ఆరోపణలు చేశారు. కిషన్ రెడ్డి తెలంగాణ పాలిట దద్దమ్మ అయితే మోడీ దేశం పాలిట ప్రజాకంఠకుడు అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. బీజేపీ దొంగల ముఠా గా తయారైందని, జాతీయ కార్యవర్గ సమావేశాల పేరిట కిషన్ రెడ్డి, బండి సంజయ్ వసూళ్లకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ నేతల వసూళ్ల పర్వాన్ని పార్లమెంటు సాక్షిగా ఎండగడుతామన్న బాల్క సుమన్‌.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణకు చేసినదేమిటో చెప్పాలని ప్రశ్నించారు.

Dasoju Sravan Kumar : రక్షణ కల్పించే వ్యవస్థ అచేతన స్థితిలో ఉంది

కేసీఆర్‌ను తిట్టడానికి పరిమితమయితే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా.. దేశమంతా బై బై మోడీ అంటున్నారని, ఇకనైనా బీజేపీ నేతలు సిగ్గుపడి బుద్ది తెచ్చుకోవాలంటూ ఆయన హితవు పలికారు. ఇదిలా ఉంటే.. బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశాల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం తెలంగాణకు విచ్చేస్తుంది. ఇప్పటికే బీజేపీ జాతీయ నేతలు, కేంద్రమంత్రులు తెలంగాణకు చేరుకున్నారు. కొంతమంది కేందమంత్రులు తెలంగాణలోని వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. సాలు దొర.. సెలవు దొర పేరిట బీజేపీ ఎల్‌ఈడీ స్ర్కీన్‌ను ఏర్పాటు చేస్తే… సాలు మోడీ.. సంపకు మోడీ పేరిట టీఆర్‌ఎస్‌ నేతలు సైతం హోర్డింగులు పెట్టారు.

 

Exit mobile version