Site icon NTV Telugu

Tragedy : మియాపూర్ లో విషాదం.. భవనం పై నుండి దూకి 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

Dead

Dead

Tragedy : హైదరాబాద్‌ నగరంలోని మియాపూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 10వ తరగతి విద్యార్థిని హన్సిక (14) ఆత్మహత్యకు పాల్పడి కుటుంబ సభ్యులు, స్నేహితులను మృదువుగా కలిచివేసింది. ఈ ఘటన మియాపూర్‌లోని జనప్రియ అపార్ట్మెంట్స్‌లో జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, హన్సిక ఒక ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. గురువారం సాయంత్రం సమయంలో ఆ బాలిక అపార్ట్మెంట్‌ భవనం పై నుండి దూకింది.

Luxury Cars Tax Penalty: అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ కార్లకు రూ.38 లక్షల జరిమానా..!

తలకు బలమైన గాయాలు కావడంతో ఘటన స్థలంలోనే ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో జనప్రియ అపార్ట్మెంట్స్ పరిసరాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Anirudh: హే అనిరుధ్.. ఈసారి నువ్ కాపీ కొట్టి దొరికేశావా?

Exit mobile version