Site icon NTV Telugu

Vemula Prashanth Reddy: రేవంత్ రెడ్డివి దొంగ మాటలు.. తనతో ఉన్నవాళ్లు కూడా దొంగలు

Vemula Prashanth Reddy

Vemula Prashanth Reddy

Vemula Prashanth Reddy: రేవంత్ రెడ్డివి అన్ని దొంగ మాటలు, ఆయన వెంట ఉన్న వాళ్లందరూ దొంగలు అంటూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసిఆర్ ప్రభుత్వం కట్టించిన ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కాంగ్రెస్ కట్టించిన 10 ఇళ్లలో సమానం అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మోడీ ప్రభుత్వం మాటలు తప్పా.. రూపాయి సాయం లేదన్నారు. బాల్కొండలో కట్టిన ప్రతి డబుల్ బెడ్రూం ఇల్లు కేసిఆర్ ఇచ్చిన పైసలతో కట్టిందే అన్నారు. ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజన పథకం ప్రారంభంలో నిజామాబాద్ జిల్లాలోఎంత మందికి వచ్చిందని, ఇప్పుడు ఎంత మందికి వస్తుందని ఎంపి అర్వింద్ సమాధానం చెప్పాలి..? ప్రశ్నించారు.

Read also; Kishan Reddy: స్వప్న లోక్ ఘటన.. వరుస ప్రమాదాలు జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదు

బీజేపీ, కాంగ్రెస్ నాయకులవి అన్ని అబద్ధపు మాటలు, అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మోడీ పాలన వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులు అరిగోస పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసిఆర్ ను కట్టడి చేయాలని ఆయన బిడ్డ కవితమ్మను కేసుల పేరుతో వేధిస్తున్నరని నిప్పులు చెరిగారు. లక్షల కోట్లు దోచుకున్న మోడీ దోస్త్ అదానీ మీద విచారణ చేయాలని పార్లమెంట్లో ప్రతి ఎంపి ప్రశ్నిస్తున్నాడని తెలిపారు. ఎల్ఐసి, ఎస్బిఐ లో ప్రజల డబ్బులు మాయం చేసిన అదానీ మీద విచారణ చేయరు కానీ, సంబంధం లేని కేసులో కవితమ్మను విచారణ చేస్తున్నరని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Black Cumin: నల్ల జీలకర్రతో ప్రయోజ‌నాలు తెలిస్తే అస్సలు వదలరు

Exit mobile version