మన వంటింట్లో పోపుల గిన్నెలో ఉండే వాటిల్లో జీలకర్ర కూడా ఒకటి. జీలకర్రను ఉపయోగించడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని మనందరికీ తెలుసు.
జీలకర్రలో మనం తరచూ ఉపయోగించే జీలకర్ర కాకుండా నల్ల జీలకర్ర కూడా ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ నల్ల జీలకర్రను ఎక్కువగా ఉపయోగిస్తారు.
నల్ల జీలకర్రను ఉపయోగించి మనం అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు. నల్ల జీలకర్ర వల్ల ఏయే అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం.
నల్ల జీలకర్రను చేదు జీలకర్ర అని కూడా అంటారు. నల్ల జీలకర్రను ఉపయోగించి ఒక మరణాన్ని తప్ప మిగిలిన అన్ని రకాల వ్యాధులను నయం చేసుకోవచ్చని ఆయుర్వేద గ్రంథాలలో ఋషులు పేర్కొన్నారు.
నల్ల జీలకర్రలో శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. నల్ల జీల కర్రలో ఉండే రసాయనిక పదార్థాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.
మనకు వచ్చే కడుపు సంబంధిత సమస్యలను, మూత్రపిండాల సంబంధిత సమస్యలను, కాలేయ, గుండె, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలను నయం చేయడంలో పని చేస్తుంది.
శరీరంలో అధికంగా ఉండే కొవ్వును కరిగించంలో, బీపీని నియంత్రించడంలో, చర్మ సంబంధిత సమస్యలను నయం చేయడంలో కూడా ఈ నల్ల జీలకర్ర దోహదపడుతుంది.
నల్ల జీలకర్ర యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరస్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు దీనికి సంబంధించిన ఫేస్ ప్యాక్ వల్ల అందం పెరుగుతుంది.
శరీరంలో ఉండే నొప్పులను, వాపులను తగ్గించడంలో అలాగే దగ్గు, జలుబు వంటి ఇన్ ఫెక్షన్ లను తగ్గించడంలోనూ ఈ జీలకర్ర మనకు తోడ్పడుతుంది.
నల్ల జీలకర్ర నూనెను రాసుకోవడం వల్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఈ విధంగానే కాకుండా నల్లజీలకర్రను పొడిగా చేసి దానికి తేనెను కలిపి ఉదయం పరగడుపున తీసుకున్నా కూడా మనకు ఎంతో మేలు కలుగుతుంది.
ప్రస్తుతం వాతావరణ మార్పుల కారణంగా మనం ఇన్ ఫెక్షన్ ల బారిన పడే అవకాశాలు ఎక్కువ కనుక నల్ల జీలకర్రను ఉపయోగించడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము.