నీరా ఆరోగ్య ప్రదాయిని: మంత్రి శ్రీనివాస్ గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాటి, ఈత చెట్ల నుంచి సేకరించిన నీరా ఆరోగ్య ప్రదాయిని అని, ఇందులో పోషక విలువలు అధికంగా ఉన్నాయని, ఆబ్కారీ, పర్యాటక, శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈ విషయం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన మైక్రోబయాలజీ డిపార్ట్ మెంట్ హెడ్ డా. భీమా నేతృత్వంలో జరిగిన పరిశోధనలోనూ తేలిందన్నారు. ఈ సందర్భంగా డా.భీమా తోటి శాస్ర్తవేత్తలు డా. చంద్రశేఖర్, డా. శ్రీనివాస నాయక్ లతో కలిసి మంత్రితో భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ డా. భీమా నేతృత్వంలో వచ్చిన శాస్త్రవేత్తలతో చర్చించారు. డా. భీమా మైక్రోబయాలజీ రంగంలో గత 8ఏళ్ల నుంచి పరిశోధనలు చేసి పీహెచ్ డి సాధించారన్నారు. అమెరికాలో పీడీఎఫ్ ను పూర్తి చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం మైక్రో బయాలజీ డిపార్ట్మెంట్ హెడ్ గా నీరా పై పరిశోధన లు నిర్వహిస్తున్నారన్నారని మంత్రి తెలిపారు. ఈ పరిశోధనలో తాటి, ఈత చెట్ల నుండి సేకరించిన నీరా దీర్ఘకాలం పాటు సుమారు 6 నెలల పాటు నిల్వ ఉండే విధంగా ప్రాసేస్ చేసి నీరాను సహజ సిద్ధంగా ఉండేలా, నీరాలో ఉండే పోషక విలువలు, క్యాన్సర్ వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటాయని శాస్ర్తవేత్తలు మంత్రికి వివరించారు.
Read Also: ఎన్నికల్లో గెలిస్తే ఉచిత విద్యుత్ ఇస్తాం: అఖిలేష్ యాదవ్
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
కిడ్నీ స్టోన్ నివారణ కు సంబంధించిన ఓక్సలేట్ డికొర్ బాక్సిలేస్ ఎంజైమ్స్ (ఓడిఈ) సంవృద్ధిగా ఉండి కిడ్నిలో రాళ్ళు ఏర్పడకుండా ఉపయోగపడుతుందని అధ్యయనంలో తేలిందని మంత్రికి వివరించారు. తన పరిశోధన ద్వారా తెలియజెప్పటంతోపాటు, నీరాను దీర్ఘ కాలం పాటు నిల్వఉండేలా గత సంవత్సర కాలంగా పరిశోధనలు చేసి మెరుగైన ఫలితాలు సాధించిన డా. భీమాను ఆయన బృందాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం లో గీత వృత్తిదారుల సంక్షేమం, గీత వృత్తి ప్రోత్సాహం ను అందించాలనే లక్ష్యం తో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీని ప్రవేశపెట్టారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. దీన్లో భాగంగా 20 కోట్ల రూపాయల వ్యయంతో హైదరాబాద్ లోని నెక్లస్ రోడ్డులో నీరా కేఫ్ ఏర్పాటుకు పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!