తాటి, ఈత చెట్ల నుంచి సేకరించిన నీరా ఆరోగ్య ప్రదాయిని అని, ఇందులో పోషక విలువలు అధికంగా ఉన్నాయని, ఆబ్కారీ, పర్యాటక, శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈ విషయం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన మైక్రోబయాలజీ డిపార్ట్ మెంట్ హెడ్ డా. భీమా నేతృత్వంలో జరిగిన పరిశోధనలోనూ తేలిందన్నారు. ఈ సందర్భంగా డా.భీమా తోటి శాస్ర్తవేత్తలు డా. చంద్రశేఖర్, డా. శ్రీనివాస నాయక్ లతో కలిసి మంత్రితో భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రి శ్రీనివాస్…