Site icon NTV Telugu

Minister Seethakka : కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి సీతక్క

Minister Seethakka

Minister Seethakka

Minister Seethakka : మంత్రి సీతక్క ప్రజా భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌కు కేటీఆర్ స్పందించిన తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కు కేటీఆర్ కు అర్దం కానట్లు ఉందని, విదేశాలలో ఉన్న కేటీఆర్ తెలంగాణకు వచ్చినట్లు చెప్పేందుకే ప్రెస్ మీట్ పెట్టినట్టుగా ఉందన్నారు.

Raj Thackeray: ఠాక్రేలను కలపడానికి, బాలాసాహెబ్ చేయలేనిది ఫడ్నవీస్ చేశారు..

కేటీఆర్ గుర్తింపు సమస్యతో బాధపడుతున్నాడని, ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లో చర్చిద్దాం రా అంటే…ప్రెస్ క్లబ్ కు రమ్మనడం ఏంటి అని మంత్రి సీతక్క సెటైర్‌ వేశారు. ప్రజలు ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నది ప్రెస్క్లబ్ లో చర్చించడానికి కాదని, అసెంబ్లీలో చర్చించ మంటే.. ప్రెస్ క్లబ్ కు రావాలని కోరడం ఏంటి అని ఆమె అన్నారు.

72 గంటల డెడ్లైన్ అంటూ అర్థం పర్ధం లేని మాటలు మాట్లాడుతున్నాడని, డెడ్ అయిన పార్టీ డెడ్ లైన్ పెట్టడం విడ్డూరంగా ఉందని, నీ సొంత చెల్లే ..నిన్ను నాయకునిగా గుర్తించడం లేదని, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ కి రాడా… సమస్యల పై చర్చింద్దాం రా అంటే భయమెందుకు అని ఆమె ప్రశ్నించారు.

Abhishek Bachchan : ఐశ్వర్యరాయ్ తో డివోర్స్.. ఎట్టకేలకు స్పందించిన అభిషేక్..

Exit mobile version