Harish Rao Inspects Railway Track Works In Siddipeta: సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు సడెన్ ట్విస్ట్ ఇచ్చారు. ఆకస్మికంగా పలు పనులని పరిశీలించారు. ముఖ్యంగా.. సిద్దిపేట – రంగదాంపల్లి రైల్వే స్టేషన్, దుద్దెడ – సిద్ధిపేట రైల్వే స్టేషన్ వరకూ రైల్వే ట్రాక్ లైన్‌ని పరిశీలించారు. అయితే.. సిద్ధిపేట – రంగదాంపల్లి రైల్వే స్టేషన్ పనులు మందకొడిగా సాగుతుండటంతో, రైల్వే శాఖపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. మార్చిలోపు సిద్ధిపేటలో రైలు కూత వచ్చేలా యుద్ధప్రాతిపదికన రైల్వే ట్రాక్ పనులు పూర్తి చేయాలని రైల్వే శాఖ అధికారుల్ని ఆదేశించారు. దుద్దెడ-సిద్ధిపేట వరకు రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో జాప్యం జరగొద్దని, పనుల వేగం పెంచాలని సూచించారు. ఈ రైల్వే ట్రాక్ పనులతో పాటు మందపల్లి వద్ద అండర్ పాస్, కుకునూరుపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణ జాప్యంపై ఆరా తీసిన మంత్రి.. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని చెప్పారు. శ్రీ కొమురవెళ్లి మల్లన్న ఆలయానికి వచ్చే భక్తుల రాక, స్టేషన్ నిర్మాణంపై రైల్వే శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్‌తో సమాలోచనలు జరిపారు.
Shalini Kidnap Case: సినీ ఫక్కీలో యువతి కిడ్నాప్.. పూజ చేసి బయటకు వస్తుండగా..
అంతకుముందు.. కొమురవెల్లిలో మల్లికార్జునస్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్న హరీశ్ రావు, ప్రభుత్వం తరఫున రూ. 1 కోటి విలువైన బంగారు కిరీటాన్ని సమర్పించారు. వచ్చే ఏడాది మేడమ్మకు, కేతమ్మకు సైతం బంగారు కిరీటాలను చేయిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను.. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మరోవైపు.. డయాలసిస్ రోగులకు సేవలందించే విషయంలో రాష్ట్రం ముందుందని, దేశంలో సింగిల్ యూజ్ ఫిల్టర్ డయాలసిస్ సిస్టమ్‌ను ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి తీసుకొచ్చిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని హరీశ్ రావ్ పేర్కొన్నారు. గతంలో ఇది కార్పొరేట్ హాస్పిటళ్లకే పరిమితమైందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రల్లో ఆరోగ్యశ్రీ కింద ఒక్క రూపాయి ఖర్చుపెట్టకుండా.. పేద ప్రజలకు సింగిల్ యూజ్ ఫిల్టర్ సిస్టం ద్వారా డయాలసిస్ అందిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు 10 వేల మందికి డయాలసిస్ చేస్తున్నామని.. డయాలసిస్ చేయించుకునేవారికి బస్‌పాస్, పెన్షన్లు, ఉచితంగా మందులు అందిస్తున్నామని పేర్కొన్నారు. డయాలసిస్‌పై ప్రభుత్వం ఏటా రూ.100 కోట్లు వెచ్చిస్తోందని చెప్పారు.
Man Killed Over Land Issue: ప్రాణం తీసిన భూ వివాదం.. మార్నింగ్ వాక్ చేస్తుండగా..