Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Minister Ktr Will Inaugurate The Uppal Skywalk Today

Uppal Skywalk: ఉప్పల్ స్కైవాక్.. నేడు ప్రారంభించనున్న కేటీఆర్

Published Date :June 26, 2023 , 8:37 am
By NTV WebDesk
Uppal Skywalk: ఉప్పల్ స్కైవాక్.. నేడు ప్రారంభించనున్న కేటీఆర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Uppal Skywalk: హైదరాబాద్ నగరంలో ఉప్పల్ స్కై వాక్ అందుబాటులోకి రానుంది. నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ చౌరస్తా వద్ద కాలినడకన రోడ్డు దాటే వారి కోసం ప్రత్యేక స్కైవాక్ అందుబాటులోకి రానుంది. భారీ సంఖ్యలో వాహనాలు ఇక్కడికి తరలివస్తున్న నేపథ్యంలో ఈ స్కైవాక్‌ను ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ వంతెనను ప్రారంభించనున్నారు. నగరంలోని పెద్ద కూడళ్లలో ఒకటైన ఉప్పల్ సర్కిల్ వద్ద హెచ్‌ఎండీఏ స్కైవాక్‌ను ఏర్పాటు చేసింది. వాహనాలు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ స్కైవాక్‌ను నిర్మించడం విశేషం. భారీ సంఖ్యలో వాహనాలు ఇక్కడికి తరలివస్తున్న నేపథ్యంలో ఈ స్కైవాక్‌ను ఏర్పాటు చేశారు. 660 మీటర్ల మేర ఏర్పాటు చేస్తున్న ఉప్పల్ స్కైవాక్ నిర్మాణానికి హెచ్ ఎండీఏ రూ.25 కోట్లు వెచ్చించింది. ఈ వంతెన ఉప్పల్, సికింద్రాబాద్, LB నగర్, రామంతాపూర్ రోడ్లు మరియు మెట్రో స్టేషన్‌తో అనుసంధానించబడి ఉంది. ఈ నిర్మాణంతో ప్రయాణికులకు పెద్ద ఊరట లభించనుంది. నాలుగు వైపుల నుంచి నేరుగా మెట్రో స్టేషన్‌కు చేరుకునేలా రోడ్లు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఎక్కడా రోడ్డు దాటాల్సిన అవసరం లేకుండా ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, స్కైవాక్ నుంచి ప్రయాణించవచ్చు.

Read also: TS Schools: నేడు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ బంద్..! ABVP పిలుపు..?

మెట్లు ఎక్కలేని వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు, గర్భిణులు స్కైవాక్‌కు చేరుకోవడానికి అత్యాధునిక ఎస్కలేటర్లు, లిఫ్టులు వంటి సౌకర్యాలు కల్పించారు. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జితో ఉప్పల్ జంక్షన్ ప్రాంతంలో ప్రయాణికుల రద్దీ తగ్గి వాహనాల రాకపోకలు తప్పవని హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు. స్కైవాక్ మొత్తం పొడవు 640 మీటర్లు, వెడల్పు 3-4 మీటర్లు, 8 లిఫ్టులు, 6 మెట్ల మార్గాలు, 12 ఎస్కలేటర్లు, 4 ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఏర్పాటు చేశారు. రామంతాపూర్ రోడ్డు, నాగోలు రోడ్డు, జీహెచ్‌ఎంసీ థీమ్‌ పార్క్, వరంగల్ బస్టాప్, ఉప్పల్ పోలీస్ స్టేషన్, ఎమ్మార్వో కార్యాలయం, ఉప్పల్ సబ్ స్టేషన్ ఉప్పల్ జంక్షన్ నిర్మించి అందుబాటులోకి తీసుకురానున్నారు. మొత్తం 660 మీటర్ల పొడవుతో పాదచారుల వంతెన సుందరీకరణ కోసం పై భాగంలో 40 శాతం మాత్రమే రూఫ్ కవరింగ్ ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ మెట్రో స్టేషన్ మీదుగా రోజుకు 25 వేల నుంచి 30 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక నుంచి ఉప్పల్ మెట్రో రైలును ప్రయాణికులు మెట్రో కాన్ కోర్ నుంచి పాదచారుల వంతెన మీదుగా తమ తమ గమ్యస్థానాలకు చేరుకోనున్నారు.
KCR Maharashtra Tour: నేడే మహారాష్ట్రకు సీఎం కేసీఆర్.. పర్యటన వివరాలు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • inaugurate the Uppal Skywalk
  • KTR inaugurate Uppal Skywalk
  • Minister KTR
  • Uppal Skywalk
  • Uppal Skywalk inaugurate KTR

తాజావార్తలు

  • IPL Trophy: తొలి టైటిల్ కోసం ఎదురుచూపులు.. ఆర్సీబీనే కాదు, చెన్నై-ముంబైకి తప్పని నిరీక్షణ!

  • Vayuputra : ‘వాయుపుత్ర’కు నాగవంశీ బ్రేకులు?

  • Sunetra Pawar: పోలింగ్‌కు ముందే విక్టరీ.. బారామతిలో సునేత్ర పవార్ ‘పవర్’!

  • Jeevan Reddy : KCR పాలన బెటర్ అనే భావనతోనే BRSలో చేరుతున్నా..

  • Dale Steyn: చాలా పెద్ద తప్పు చేశాడు.. మిల్లర్ పై విరుచుకపడ్డ డేల్ స్టెయిన్..!

ట్రెండింగ్‌

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions