హైదరాబాద్ నగరంలో ఉప్పల్ స్కైవాక్ అందుబాటులోకి రానుంది. జంటనగరాల్లో కాలినడకన వెళ్లే వారికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుండగా.. ఇవాళ ఉదయం 11 గంటలకు మంత్రి కేటీఆర్ ఈ స్కైవాక్‌ను ప్రారంభించనున్నారు.
ఉప్పల్ రింగ్ రోడ్డులో పాదచారుల వంతెన (స్కైవాక్) సిద్ధంగా ఉంది. ఇది ప్రారంభించడానికి అందంగా ముస్తాబైంది. ఉప్పల్ చౌరస్తాకు ఇరువైపులా నిత్యం 20 వేల నుంచి 25 వేల మంది పాదచారులు రోడ్డు దాటుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.