Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ జట్టులో సీనియర్ పేసర్ల పునరాగమనంపై చర్చ జోరుగా సాగుతోంది. నాల్గేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సీనియర్ స్వింగ్ మాంత్రికుడు భువనేశ్వర్ కుమార్ భారత్ తరఫున రీఎంట్రీ ఇస్తుండటం క్రికెట్ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారింది. రాబోయే న్యూజిలాండ్ పర్యటనలోని ఐదు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌కు భువనేశ్వర్ కుమార్ ఎంపికవ్వడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే మరో సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ స్పందించారు. భువి రీఎంట్రీపై తనకు ఎలాంటి అసూయ కానీ, ఆందోళన కానీ లేదని స్పష్టం చేశారు.
భువనేశ్వర్ కుమార్‌కు మళ్లీ దేశం తరఫున ఆడే అవకాశం దక్కడం సంతోషకరమైన విషయమని, కానీ ఆయన సెలక్షన్ తనను ఏమాత్రం కలవరపెట్టడం లేదని షమీ తేల్చిచెప్పారు. రంజీ ట్రోఫీ 2026 సీజన్ ప్రారంభానికి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన సొంత కెరీర్ గురించి మాట్లాడుతూ. తాను ఎక్కడ ఆడే అవకాశం వచ్చినా వంద శాతం శ్రమిస్తానని, ప్రస్తుతం తన పూర్తి దృష్టి రంజీ మ్యాచ్‌లపైనే ఉందని తెలిపారు. గత రెండు మూడు సంవత్సరాలుగా తనకు ఇదే అనుభవం ఎదురవుతోందని నిరాశ చెందారు. దేశవాళీ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచి, బెంగాల్ జట్టుకు తన ఫిట్నెస్ను నిరూపించుకున్నానని గుర్తుచేశారు. అయినా తనను సెలెక్ట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
తనకు ఫిట్నెస్ ఉన్నప్పటికీ తుది జట్టులో అవకాశం ఇవ్వకపోతే, అది తన నష్టం కాదని, సెలెక్టర్ల లేదా యాజమాన్యానికే నష్టమని షమీ ఘాటుగా వ్యాఖ్యానించారు. కాగా.. షమీ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడారు. 2023 వన్డే ప్రపంచ కప్ తర్వాత తీవ్ర గాయాలపాలైన ఆయన, కోలుకోవడానికి సుదీర్ఘ సమయం పట్టింది. ఆ తర్వాత దేశవాళీలో రాణించినప్పటికీ, ప్రధాన సెలెక్టర్లు ఆయన ఫిట్నెస్ను కారణంగా చూపుతూ పక్కనపెడుతూ వచ్చారు. ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా వంటి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తూ వచ్చారు.
మరోవైపు.. 2027 వన్డే ప్రపంచ కప్ సమీపిస్తున్న తరుణంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పాటు భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీల వన్డే జట్టులోకి రీఎంట్రీ గురించిన చర్చ కూడా తీవ్రమైంది. ప్రస్తుత యువ పేసర్లు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతుండటంతో, మెగా టోర్నీ కోసం అనుభవజ్ఞులైన సీనియర్ల సేవలను వినియోగించుకోవాలనే డిమాండ్ కూడా పెరుగుతోంది. మొత్తానికి షమీ చేసిన ఈ వ్యాఖ్యలు భారత క్రికెట్ సర్కిల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!