టాలీవుడ్ టాప్ డాన్సర్స్ లిస్ట్ తీస్తే అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పక్కాగా ఉంటాడు. చిన్నప్పటి నుంచే క్లాసికల్ డాన్సర్ అయిన ఎన్టీఆర్, ఎలాంటి స్టెప్ ని అయినా రిహార్సల్ కూడా చేయకుండా వేస్తాడనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఎఫర్ట్ లెస్ గా డాన్స్ వేయగల ఎన్టీఆర్ పక్కన డాన్స్ చేయడానికి హీరోయిన్స్ కూడా భయపడుతూ ఉంటారు. ప్రాక్టీస్ కూడా చేయకుండా ఎన్టీఆర్ అంత ఈజీగా స్టెప్స్ ఎలా వేస్తాడు అని డాన్స్ మాస్టర్ ఆశ్చర్యపోయి ఇంటర్వ్యూస్ లో చెప్పిన మాటలు కూడా యుట్యూబ్ లో చాలానే ఉన్నాయి. ఒక కంప్లీట్ డాన్సర్ గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ కి ఈరోజు వరకూ స్క్రీన్ పైన పోటీ లేదు కానీ ఈసారి మాత్రం ఇలాంటి సంభవం జరగబోతుంది. ఎన్టీఆర్ డాన్స్ కి పోటీగా ఒక స్టార్ హీరో నిలబడబోతున్నాడు. గత 24 గంటలుగా సోషల్ మీడియాలో నడుస్తున్న డిస్కషన్ ఇదే… “అసలు ఈయన ముందు ఎన్టీఆర్ కనిపిస్తాడా?” అని… కామన్ ఆడియన్స్ కి ఆశ్చర్యం కలిగించే ఈ మాట, ఎన్టీఆర్ ఫాన్స్ కి కంగారు పెడుతుంది కూడా. ఎందుకంటే ఎన్టీఆర్ కి అపోజిట్ కి వినిపిస్తున్న పేరు హ్రితిక్ రోషన్ ది కాబట్టి.
గ్రీక్ గాడ్ గా పేరున్న హ్రితిక్ రోషన్ డాన్స్ ని కేరాఫ్ అడ్రెస్ లా ఉంటాడు. స్మూత్ గా మంచి ఈజ్ తో డాన్స్ చేయడం హ్రితిక్ నైజం. అతను డాన్స్ చేస్తుంటే స్టైల్ అండ్ స్వాగ్ ఉంటాయి. అందుకే హ్రితిక్ రోషన్ డాన్స్ కి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇండియాలోనే బెస్ట్ డాన్సర్ గా పేరున్న హ్రితిక్ రోషన్, రీసెంట్ గా జరిగిన ‘ఐఫా’ అవార్డ్స్ ఈవెంట్ లో ‘కహో నా ప్యార్ హై’ సినిమాలోని ‘ఎక్ పల్ కా జీనా’ సాంగ్ కి డాన్స్ చేసాడు. బాలీవుడ్ స్టార్స్ మధ్యలో హ్రితిక్ రోషన్ ‘ఎక్ పల్ కా జీనా’ హుక్ స్టెప్ ని వేసి స్టాండింగ్ ఓవియేషన్ అందుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడి నుంచే సోషల్ మీడియాలో ఎన్టీఆర్, హ్రితిక్ రోషన్ ముందు కనిపిస్తాడా? అనే చర్చ మొదలయ్యింది.
‘కహో నా ప్యార్ హై’ హ్రితిక్ మొదటి సినిమా, అప్పటి నుంచి ఇప్పటివరకూ హ్రితిక్ డాన్స్ లో ఎలాంటి మార్పులు రాలేదు, డాన్స్ లో గ్రేస్ తగ్గలేదు. ఎన్టీఆర్ లాగే హ్రితిక్ కూడా డాన్స్ లో పోటీ లేదు అనే మాట బాలీవుడ్ లో ఉంది. అలాంటి హ్రితిక్ రోషన్ ఎదురుగా ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నాడు. ఈ ఇద్దరు ఫేస్ ఆఫ్ డాన్స్ తో ఒక్క సాంగ్ పడితే ఇండియన్ స్క్రీన్ పైన నెవర్ బిఫోర్ మ్యాజిక్ జరుగుతుంది. ఎవరు ఎవరిని డామినేట్ చేస్తారు? హ్రితిక్ ముందు ఎన్టీఆర్ కనిపిస్తాడా లేదా అనేది వార్ 2 రిలీజ్ అయ్యే వరకూ ఆగాల్సిందే.