Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sangareddy: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని పెద్దకంజర్ల గ్రామ శివారులో ఘోర విషాదం చోటుచేసుకుంది. నేరేడు చెరువులో వినాయక నిమజ్జనం చేయడానికి వెళ్లిన శిరీష అనాథాశ్రమానికి చెందిన ఆరుగురు విద్యార్థులు నీటిలో మునిగి దుర్మరణం చెందారు. సరదాగా సాగాల్సిన నిమజ్జనం క్షణాల్లో విషాదాంతంగా మారడంతో స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ఘటన పై సమాచారం అందుకున్న వెంటనే పటాన్చెరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పటాన్‌చెరులోని ప్రాచీన ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆస్పత్రికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. బాధిత అనాథాశ్రమ నిర్వాహకులను పరామర్శించి, ఈ ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు అధికారులు ప్రమాదంలో మరణించిన విద్యార్థుల వివరాలు తెలియజేశారు.
1. నర్సింహ రాజు
2. సుమంత్ (డిప్లొమా సెకండ్ ఇయర్)
3. గణేష్ (డిప్లొమా సెకండ్ ఇయర్)
4. ఉదయ్ కిరణ్ (డిప్లొమా థర్డ్ ఇయర్)
5. శ్యామ్ కుమార్ (డిప్లొమా ఫస్ట్ ఇయర్)
6. సిద్దార్థ్ (10వ తరగతి)
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఇక, వినాయక నిమజ్జనోత్సవాలు అత్యంత వైభవంగా జరిగే సమయంలో చెరువులు, నదీ తీరాల వద్ద తగిన జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. ముఖ్యంగా నిమజ్జన ప్రాంతాలకు భారీగా జనం తరలివస్తారు కాబట్టి తొక్కిసలాట జరగకుండా వరుస క్రమాన్ని పాటించాలి. చిన్న పిల్లలను, వృద్ధులను నీటి ఒడ్డుకు దూరంగా ఉంచడం శ్రేయస్కరం. విగ్రహాలను నీటిలో కలిపేందుకు కేవలం నైపుణ్యం ఉన్న యువకులు లేదా రెస్క్యూ సిబ్బంది మాత్రమే ముందుకెళ్లాలి. నీటి లోతుపై అవగాహన లేకుండా లోతైన ప్రాంతాల్లోకి దిగడం ప్రమాదకరం. ప్రభుత్వం లేదా నిర్వాహకులు ఏర్పాటు చేసిన క్రేన్లు, ప్రత్యేక ఘాట్లను మాత్రమే నిమజ్జనం కోసం ఉపయోగించాలి. మత్తు పానీయాలు సేవించి నీట్లోకి దిగడం లేదా స్టంట్లు చేయడం లాంటి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. రాత్రి వేళల్లో తగినంత వెలుతురు ఉన్న ప్రాంతాలనే ఎంచుకోవాలి. విద్యుత్ వైర్లు, తాత్కాలిక షెడ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పరిస్థితుల కోసం ఈతగాళ్ళు, రక్షణ రబ్బరు పడవలు, ప్రథమ చికిత్స బృందాలు అందుబాటులో ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే ఈ పండుగను సురక్షితంగా, సంతోషంగా ముగించవచ్చు.
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!