మన్నెగూడలో యాదవ – కురమల సభలో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో గొల్ల కురుమల పరిస్థితి, కులవృత్తికి సంబంధించిన పరిస్థితి ఎలా ఉండేది?తెలంగాణ వచ్చినంక ఎలా బాగా అయిందో ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ రాకముందు రెండు లక్షల ఇరవై ఒక్క వేల మంది సభ్యులు మాత్రమే గొర్రెల పెంపకం దారుల సొసైటీలో మెంబర్లుగా ఉండేది. ఈరోజు ఆ సంఖ్య ఏడు లక్షల 61 వేలకు పెరిగిన పెరిగిన సంగతి నిజమా కాదా? గ్రామీణ ప్రాంతంలో ఉండే కులవృత్తులకు జీవం పోసే ఉద్దేశంతో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే ఆలోచనతో, రాష్ట్ర అభివృద్ధిలో గొల్ల కురుమలను భాగస్వాములను చేసేందుకు పదకొండు వేల కోట్ల రూపాయలతో రెండు విడతల్లో గొర్రెల పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ … ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు మంత్రి కేటీఆర్.
Read Also: AHA: ‘అందరూ బాగుండాలి…’ టీజర్, ట్రైలర్ విడుదల
తెలంగాణ పథకాలు నెంబర్వన్ గా ఉన్నాయని కేంద్ర మంత్రులు పురుషోత్తం రూపాల, గిరిరాజ్ సింగ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ని ప్రశంసించారు. బయటి వాళ్లు వచ్చి చెప్తే తప్ప మన గొప్పతనం ఏంటో మనకు అర్థం కావడం లేదు. గొల్ల కురుమ సోదరుల కోసం తెలంగాణలో అమలు చేస్తున్నటువంటి పథకాలు దేశంలో మరెక్కడ అమలు కావడం లేదన్నది వాస్తవం.పరిశ్రమలు అంటే టాటాలు మాత్రమే కాదు తాతలనాటి కులవృత్తులు కూడా బాగుంటే దేశం కూడా బాగుంటుందనేది కేసీఆర్ ఆలోచన అన్నారు.
గొల్ల కురుమల సంక్షేమం కోసం పనిచేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఎల్లవేళలా యాదవుల ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నా అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య జయంతిని అధికారికంగా జరపాలన్న గొల్ల కురుమల డిమాండ్ ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. సదర్ పండుగను అధికారికంగా జరిపే డిమాండ్ ను కూడా నెరవేరుస్తుందన్నారు మంత్రి కేటీఆర్.
Read Also: Youth Inspiration: పెర్కంపల్లి తండా యువత స్ఫూర్తి.. పాడైన రోడ్డుకి మరమ్మతులు