ఆ రికార్డ్ ఈ రికార్డ్ అంటే కుదరదు.. ఇక్కడుంది పాన్ ఇండియా రూలర్.. అన్ని రికార్డులు క్రాష్ అయిపోవాల్సిందే. ప్రభాస్ పేరు వింటే చాలు.. బాక్సాఫీస్ బేంబేలెత్తిపోతోంది. ఆయన సినిమా వస్తుందంటే చాలు, ఆ రోజును ఓ పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అభిమానులు. డార్లింగ్ అంటూ.. వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు ఫ్లాప్ అయినా కూడా.. డే వన్ వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాయి అంటే.. అది కేవలం ప్రభాస్ క్రేజ్ వల్లేనని చెప్పొచ్చు. అందుకే.. ప్రభాస్ సినిమా థియేటర్లోకి వస్తుందంటే చాలు.. సెంచరీతోనే డే వన్ స్టార్ట్ అయిపోయినట్టే. ఇక ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామిని తట్టుకోవడం కష్టమే.. అనేలా భారీ అడ్వాన్స్ బుకింగ్స్‌తో ఆడియెన్స్ ముందుకొచ్చింది ఆదిపురుష్. ఇప్పటికే అమెరికాలో ‘ఆదిపురుష్’ తుఫాన్ మొదలైపోయింది. యుఎస్‌లో ఫస్ట్ డే 1 మిలియన్ డాలర్స్‌కి పైగా కలెక్షన్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది ఆదిపురుష్.
ఇక ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఉన్న టాప్ 6 హండ్రెడ్ క్రోర్స్ మూవీస్‌లో.. నాలుగు ప్రభాస్ సినిమాలే ఉండడం అంటే.. మామూలు విషయం కాదు. అంతే కాదు.. ఆదిపురుష్ ఓపెనింగ్స్‌తో మూడు సినిమాలతో టాప్ 5లో నిలిచాడు ప్రభాస్. ట్రేడ్ వర్గాల ప్రకారం.. ఆదిపురుష్ 140 నుంచి 150 కోట్ల వరకు ఓపెనింగ్స్ రాబట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీంతో.. ఇప్పటి వరకు ఫస్ట్ డే హైయెస్ట్ ఓపెనింగ్ అందుకున్న టాప్ 5 సినిమాల్లో ఆదిపురుష్ నాలుగు స్థానంలో నిలిచిపోయినట్టే. 225 కోట్లతో ట్రిపుల్ ఆర్ ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా.. ఆ తర్వాత బాహుబలి 2.. 214 కోట్లు, కెజియఫ్ చాప్టర్ 2.. 163 కోట్లు, ఆదిపురుష్ 150 కోట్లు, సాహో 126 కోట్లతో టాప్ 5 లిస్ట్‌లో ఉన్నాయని చెప్పొచ్చు. ఈ లెక్కన ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభాస్ నుంచి ఎలాంటి సినిమా వచ్చిన సరే.. డే వన్ వంద కోట్లతో స్టార్ట్ అవడం పక్కా అని.. ఆదిపురుష్ మరోసారి ప్రూవ్ చేసింది.