BRS MLA Pailla Shekar Reddy: ఐ.టి సోదాలు తరువాత నాకు అధిష్ఠానం నుండి అధ్యక్షుల నుండి పార్టీ నుండి ఎలాంటి కాల్స్ రాలేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. ఐటీ రైడ్స్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా నాపై కుట్ర పూరితంగానే IT రైడ్స్ జరిగాయని అన్నారు. తనపై జరుగుతున్న పలు ఆరోపణలు నిజం కాదని తెలిపారు. IT రైడ్స్ మొదటి రోజే ఒక గంటన్నర లోనే పూర్తి అయ్యాయని, కావాలనే 3 రోజులు కాలయాపన చేశారని మండిపడ్డారు. విదేశాలలో మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయి అన్నది అవాస్తవం మని తెలిపారు. 1998 నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని అన్నారు. నాకు ఎలాంటి మైనింగ్ వ్యాపారాలు లేవని, IT అధికారులకు వారికి అనుకూలమైన సమాచారం రాకపోవడంతో నిరుత్సాహంతో వెనుతిరిగారని అన్నారు. నాకోసం మూడు రోజులుగా ఇక్కడే వున్న కార్యకర్తలకు, నాయకులకు అందరికి ధన్యవాదాలు తెలిపారు.
గత మూడు రోజుల క్రితం మెదక్ ఎంపీ కోట ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పైల శేఖర్ రెడ్డి, మర్రి జనార్థన్ రెడ్డి నివాసాలు, వ్యాపార సంస్థలు, షాపింగ్ కాంప్లెక్స్ లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీ నా నివాసంలో గంటన్నర పాటు సోదాలు జరిగాయని తెలిపారు. కావాలనే ముడు రోజుల పాటు ఐ.టి అధికారులు కాలయాపన చేశారని మండిపడ్డారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉంది ఐ.టి అధికారుల తీరు ఉందని అన్నారు. ఇంకా ఏమన్నా దొరుకుతుందా అన్న దానిపై సోదాలు జరిగాయని తెలిపారు. నా నివాసంలో ఏం కనిపించలేదని అన్నారు. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను, నా సతీమణి బెంగుళూర్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తానని స్పష్టం చేశారు. దానికి సంబందించిన డాక్యుమెట్స్ తీసుకున్నారుని తెలిపారు. ఆదాయ పన్ను చెలిస్తున్ననని స్పష్టం చేశారు. కావాలనే నా పై బురదజల్లే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఐ.టి సోదాలు వెనుక ఏ పార్టీ హస్త ఉందో అందరికి తెలుసని మండిపడ్డారు. నాకు ఈనెల 22న గురువారం రమ్మని ఐ.టి అధికారులు నోటీసులు అందజేసారని తెలిపారు. నేను నిజాయితీగా ఉన్నారని, నా నియేజకవర్గం ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు.
Vadivelu: స్టార్ కమెడియన్ నట విశ్వరూపం