KTR:2072 వరకు తాగునీటికి ఇబ్బందుల్లేకుండా ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరానికి 2072 వరకు తాగునీటికి ఇబ్బందుల్లేకుండా ముందస్తుగా ప్రణాళికలు రూపొందించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద సుంకిశాల ఇన్‌టెక్ వెల్ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల ప్రజలకు నిజంగా ఇవాళ శుభదినం అని పేర్కొన్నారు. వరుసగా ఏడేండ్లు కరువు వచ్చినా తాగునీటికి తిప్పలు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్ చుట్టుతా కూడా వాటర్ పైప్ లైన్‌లను ఏర్పాటు చేశారు.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
భవిష్యత్‌లో హైదరాబాద్ నగరం 100 కిలోమీటర్ల విస్తరించిన తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలా, బయట ఉన్న ప్రాంతాలకు కూడా తాగు నీటిని అందించేలా ప్లాన్ చేశామన్నారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం..
మెట్రో వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు ఆధ్వర్యంలో రూ. 6 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రస్తుత హైదరాబాద్‌లో నీటి అవసరాలు 37 టీఎంసీలు.. 2072 వరకు ఆలోచిస్తే ఇది పెరిగి మరో 34 టీఎంసీల అవసరం ఉంటుంది.
దాదాపు 71 టీఎంసీల నీరు అవసరం ఉండే అవకాశం ఉంది. 2035 నాటికి 47 టీఎంసీలు, 2050 నాటికి 58 టీఎంసీలు, 2065 నాటికి 67 టీఎంసీలు, 2072 నాటికి 70.97 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని అంచనా వేశామన్నారు.
సుంకిశాలలో 1450 కోట్ల అంచనా వ్యయంతో తాగునీటి అవసరాల నిమిత్తం పంపులు, మోటార్లతో పాటు అదనంగా 16 టీంఎసీలు లిఫ్ట్ చేయడానికి పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రాబోయే ఎండకాలం నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి హైదరాబాద్ ప్రజలకు తాగునీరు అందిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్ మహానగరాన్ని భవిష్యత్ తరాలకు బ్రహ్మాండమైన అసెట్‌గా అందించాలని, భవిష్యత్ భారతవాణికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా భాగ్యనగరంలో కార్యక్రమాలు చేయాలని, ఆ విధంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ తమకు ఎప్పుడూ చెప్తుంటారని కేటీఆర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు