కాంగ్రెస్, బీజేపీ నేతలకు ప్రజలే బుద్ధి చెప్పాలి.. కేటీఆర్ పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్, బీజేపీ నేతలు అభివృద్ధి నిరోధకులుగా మారారు.. వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. నకిరేకల్‌లో నిర్వహించిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణలో కడుతున్న ఒక్క ప్రాజెక్టుకు అయినా జాతీయ హోదా ఇచ్చిందా..? అని ప్రశ్నించారు.. కానీ, రాష్ట్రంలో అన్ని వర్గాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తూ ప్రగతి పథంలో నడిపిస్తున్న నాయకుడు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి అని ప్రశ్నించారు.. ఈనాడు తెలంగాణ లో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు.. సీఎం కేసీఆర్ చేపట్టిన రైతు బంధు పథకం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్న ఆయన.. ఈ వానాకాలం సీజన్లో కూడా రైతు బంధు సాయం చేస్తున్నారు సీఎం కేసీఆర్ అని గుర్తుచేశారు.. ఇప్పటి వరకు అన్ని సీజన్లలో కలిపి 50 వేల కోట్ల రూపాయలను రైతు బంధు పథకం కింద రైతులకు అందించిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని ప్రశంసించిన ఆయన.. సమైక్యాంధ్ర పాలనలో రైతులు అనేక అవస్థలు పడ్డారు.. కానీ, ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా అల్ టైం హై దిగుబడులు సాధించి గొప్ప పెరును సంపాందించింది.. తెలంగాణకే నల్గొండ జిల్లా దిక్కూచిగా నిలిచిందని తెలిపారు..
ఇక, ఎఫ్‌సీఐ లెక్కల్లో దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్నరాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ సాధించిందన్నారు మంత్రి కేటీఆర్.. గతంలో 30 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి పండించేవారు.. ఇప్పుడు కోటి ఆరు లక్షల ఎకరాల్లో వరి పండుతుంది.. ఇది మన ఘనత అన్నారు.. రైతుకు పెట్టుబడి సాయం చేయాలని దేశంలో ఏ నాయకునికి కనీస ఆలోచన రాలేదన్న కేటీఆర్.. సీఎం కేసీఆర్ నాయకత్వం లో వ్యవసాయం పండుగలా మారిందని.. రైతులు సంఘటితం కావాలని, బాగు పడాలని రైతు వేదికలను నిర్మించారని.. రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.. పండించిన ప్రతి గింజను కొంటున్న ప్రభుత్వం ఏదన్నా ఉందా అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించిన ఆయన.. తెలంగాణ రాష్ట్రం ఒక్కటే రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసిందని.. ఇది అంతా గమనించాలన్నారు.. ఇక, నకేరేకల్ లో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్న ఆయన.. మున్సిపల్, ఎమ్మార్వో కార్యాలయల నిర్మాణానికి కృషి చేస్తాం.. ఉదయ సముద్రం ప్రాజెక్ట్ పెండింగ్ పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని ప్రకటించారు.
Also Read
- CM Revanth Reddy : హైదరాబాద్ ట్రాఫిక్‌కు బిగ్ ప్లాన్.. ప్రత్యేక బ్యూరో ఏర్పాటు!
- Bhatti Vikramarka : సింగరేణి బ్లాకులు ప్రైవేట్ పరమైతే తీవ్ర ప్రమాదం
- Mandula Samuel : కాంగ్రెస్‌లో కాక రేపిన సామేల్.. కోమటిరెడ్డి బ్రదర్స్‌పై ఫైర్
- Khammam Cyber Fraud : రూ.1,000 కోట్ల సైబర్ స్కామ్.. ఖమ్మం కేసులో SIT ఎంట్రీ
- Tags
- bjp
- congress
- ktr
- Minister KTR
- Nakrekal
తాజావార్తలు
-
OTR: ‘నో పాలిటిక్స్… ఓన్లీ రూల్స్’.. నిబంధనలకే ప్రాధాన్యం అంటున్న అటవీశాఖ ఉన్నతాధికారి..
-
Story Board : రాజధానిని రగిలించారు.. చట్టసభల్ని స్తంభింపజేశారు
-
Prabhas Sreenu: “ఆ వార్తలు చదివి చాలా బాధపడ్డా”.. సినియర్ యాక్టర్‌తో రూమర్స్‌పై ప్రభాస్ శ్రీను రియాక్షన్
-
Prabhas: “నా జీవితంలో ప్రభాస్ దేవుడిలాంటి వ్యక్తి”
-
Ravi Bishnoi: రవి బిష్ణోయ్‌లో అంత చేంజ్ ఎలా వచ్చింది.. ఆ ఒక్క మార్పుతో ఫామ్‌లోకి వచ్చిన లెగ్ స్పిన్నర్..
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!