పార్లమెంట్ లో 2022-2023 సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే సీఎం కేసీఆర్ బడ్జెట్ పై మండిపడ్డారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..కేంద్ర బడ్జెట్ పై ఫైర్ అయ్యారు. తెలంగాణకు మొండిచెయ్యి చూపారని, మెట్రో రైలు కు నిధులు అడిగామని, ప్రాజెక్టులకు జాతీయ హోదా కోరామని ఆయన వెల్లడించారు. అలాగే మిషన్ భగీరథ కు ఫండ్స్ అడిగామని, ఒక్కటంటే ఒక్కటి ఇవ్వలేదని ఆయన తెలిపారు.
అంతేకాకుండా తెలంగాణ ఈ దేశంలో లేదన్నట్టు వ్యవహరించారని, ప్రగతి శీల రాష్ట్రాలకు ఇలాగేనా చేసేది అని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. పేదలకు ఉపయోగ పడే ఒక్క అంశం కూడా బడ్జెట్ లో లేదని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రం కార్పొరేట్ సంస్థల కోసం బడ్జెట్ చేసినట్టుందని ఆయన అన్నారు. మధ్య తరగతి కుటుంబాలకు సైతం బడ్జెట్ తో ఎలాంటి ప్రయోజనం కలిగే అవకాశాలు లేవని ఆయన అన్నారు.