తెలంగాణ రాజకీయ మాటల యుద్ధం కొనసాగుతోంది. వడ్ల రాజకీయం తర్వాత బీజేపీ-టీఆర్ఎస్ మధ్య రాజకీయ సమరం రంజుగా మారింది. వరంగల్ బహిరంగ సభలో కేటీఆర్ బీజేపీకి సవాల్ విసిరారు. నేను చెప్పేది తప్పైతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు నిరూపించాలి. నా మంత్రి పదవిని ఎడమకాలి చెప్పులా విసిరేస్తానన్నారు.
కేంద్రానికి తెలంగాణ 3 లక్షల 65 వేల 797 కోట్లు ఇచ్చిందన్నారు. కానీ కేంద్రం తిరిగి ఇచ్చింది కేవలం లక్ష 68 వేల 647 కోట్లు మాత్రమే అన్నారు కేటీఆర్. నిరూపిస్తే ఎమ్మెల్యేగా కొనసాగుతానన్నారు. తెలంగాణను మళ్లీ ఏపీలో కలుపుతారు. బీజేపీ దీనికి కూడా వెనకాడదని ఆరోపణలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఆ రెండు పార్టీల నాయకులు పచ్చి మోసగాళ్లు.. వారిని నమ్మొద్దని ప్రజలకు సూచించారు. ఎట్టికైనా, మట్టికైనా మనోడే ఉండాలి. మన పార్టీనే ఉండాలి. ఏనాటికైనా తెలంగాణ కోసం కేసీఆర్ కడుపులో ఉండే బాధ, కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఉండదన్నారు కేటీఆర్.
2001 లో కేసీఆర్ పేరున్న నాయకుడు కాదు. పెద్ద ఎవరికి తెలియని వ్యక్తి. అప్పుడు చంద్రబాబు. కేసీఆర్ అనే నాయకుడు లేకపోతే టీపీసీసీ, టీబీజేపీ, ఈ రోజు మెరుగుతున్న కుక్కలకు బట్టెబాజ్ గాళ్లకు మొఖం ఉందా అన్నారు. ఎవడు సంజయ్, ఎవడు రేవంత్. మోదీని బట్టేబాజ్ అనరాదా, అమిత్ షా ను తిట్టారదా కానీ మేము అలా మాట్లాడం.మాకు సభ్యత ఉంది. బఫేర్ నాయకులు, బెక్యూబ్ నాయకులు బీజేపీ నేతలు. బీజేపీ నాయకులు చిల్లర గాళ్ళు. గఫర్ పార్టీ బీజేపీ. కరీంనగర్ లో ఏం చెయ్యని ఎంపీ పాలమూరు లో ఏదో చేస్తాడట. చెప్పిన మాటలు అన్ని మరిచి ఒకడు కేవలం కేసీఆర్ ని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు.
కిషన్ రెడ్డి మంత్రిగా ఉండడం తెలంగాణకు దౌర్భాగ్యం. మోడీ ఎందుకు బోడి ఎందుకు. బోడి బీజేపీ ఎందుకు మాకు. గుజరాత్ లో తయారు అయ్యే రైలు బోగీలో మా తెలంగాణ వారి పైసలు ఉన్నాయి. ఎవరి పైసలు ఎవరు తింటున్నారు? చట్టాన్ని తుంగలో తొక్కిన ఈ బీజేపీ నాయకులు ఏమనాలి. 67 ఏళ్లలో ఎవ్వరు చేయని పనులు ఇప్పుడు చేసిన టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తారు. మఠం లకు వచ్చే పైసల్లో 30 శాతం కమిషన్ తీసుకుంటున్నారట.. ఇలాంటోళ్లు మనకు చెబుతారట అని ఎద్దేవా చేశారు కేటీఆర్.