తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ కో కి అభినందనలు తెలిపింది. అయితే కరోనా సెకండ్ వేవ్ లో అత్యధికంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. కానీ ఈ సమయంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ లో పరిస్థితి మెరుగ్గా ఉంది అని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఆక్సిజన్ దొరకక చనిపోయిన వాళ్ళు లేరు అని అన్నారు. మొత్తం వెయ్యి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు తెప్పించింది గ్రీన్ కో… అందులో మొదటి 200 తెలంగాణ కి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్. హైదరాబాద్ ఈరోజు మెడికల్ హబ్ గా ఉంది. చుట్టుపక్కల ఉండే 4 రాష్ట్రాల నుంచి కరోనా బాధితులు హైదరాబాద్ వస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలను పక్కన పెట్టి కేంద్రం నడుచుకోవాలి అని పేర్కొన్నారు.