Balkampet Yellamma: భాగ్యనగర వాసులకు కొంగు బంగారగా పేరొందిన బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయ హుండీల లెక్కింపు కార్యక్రమం పటిష్ఠ బందోబస్తు నడుమ అధికారులు నిర్వహించారు. మార్చి 30 నుంచి జూన్ 19 వరకు మొత్తం 81 రోజులకు గాను సాధారణ హుండీల్లో నోట్లు రూ.87,15,384, నాణేలు 3,53,449.. మొత్తం రూ. 90,68,833 వచ్చాయి. అన్నదానం హుండీలో రూ.1,60,686 రాగా మొత్తం ఆదాయం రూ.92,29,521 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అయితే.. హైదరాబాద్‌లోని ప్రసిద్ధ బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయంలో అత్యంత ముఖ్యమైన వార్షిక ఉత్సవం జరుగుతుంది. బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణం. ఈ సంవత్సరం అమ్మవారి కల్యాణం జూలై 9, 2024 న జరుగుతుంది. మర్నాడు అంటే జూలై 10, 2024 న రథోత్సవం జరుపుకుంటారు. మాట్లాడే దేవతగా ప్రసిద్ధి చెందిన ఎల్లమ్మ దేవిని రేణుకాదేవి, జల దుర్గ అని కూడా పిలుస్తారు.
Read also: Plane Crash: విమానానికి తప్పిన ప్రమాదం.. ఇంజిన్ లో మంటలు..
ఎందుకంటే అమ్మవారి విగ్రహం భూమికి దాదాపు 10 అడుగుల దిగువన నీటితో చుట్టుముట్టబడిన శయన స్థితిలో ఉంటుంది. మహాదేవ శివయ్యతో ఎల్లమ్మ తల్లి కళ్యాణం శక్తి మాత నిర్వహిస్తారు. ఈ కల్యాణం వల్ల తీర్ధప్రసాదాలు స్వీకరించిన భక్తుల కోరికలు నెరవేరుతాయని, అనేక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం. అమ్మవారి వార్షిక ఉత్సవాలకు వేలాదిగా భక్తులు పోటెత్తారు. ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి తెలంగాణ ప్రభుత్వం అమ్మవారికి పట్టువస్త్రాలు అందించనుంది. కల్యాణం రోజున వార్షిక రథోత్సవం నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా భక్తులు వివిధ రకాల కానుకలు సమర్పిస్తారు. భక్తులు ప్రధానంగా అమ్మవారికి చీరలు, గాజులు మరియు ఇతర సౌందర్య ఉత్పత్తులను సమర్పిస్తారు. కొందరు భక్తులు వేప ఆకులతో అలంకరించిన పాల కుండలను తీసుకువెళతారు. పసుపును పండుగలలో విరివిగా ఉపయోగిస్తారు.
PM Modi Kashmir Visit: నేటి నుంచి రెండ్రోజుల పాటు జమ్మూ కాశ్మీర్ లో ప్రధాని మోడీ పర్యటన..