రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో ఇవాళే పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. దీంతో మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ వేశారు. తన నివాసం నుంచి భారీ ర్యాలీగా బయల్దేరిన ఆయన.. పట్టణంలోని ఆర్వో ఆఫీసులో నామినేషన్ పత్రాలను అందించారు. ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.
Read Also: Fraud Case of Rs 20 lakhs : కంపెనీ ఫ్రాంచైజీ ఇస్తానంటూ రూ.20 లక్షల మోసం.. ఐదుగురిపై కేసు నమోదు
ఇక, మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో ఉద్యోగిగా బాధ్యతలు నిర్వహించిన శ్రీనివాస్‌గౌడ్ కమిషనర్‌గా పదోన్నతి పొందారు. అయితే, మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2014 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సూచనల మేరకు మహబూబ్‌నగర్ స్థానం నుంచి శ్రీనివాస్ గౌడ్ పోటీ చేసి 3 వేల 139 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అనంతరం 2018లో జరిగిన ఎన్నికల్లో 57 వేల 775 భారీ మెజార్టీతో విజయం సాధించారు. ప్రస్తుతం కేసీఆర్ మంత్రి మండలిలో శ్రీనివాస్ గౌడ్ ఎక్సైజ్, క్రీడా, పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.
Read Also: Chandrababu: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ వాయిదా
ఇక, సూర్యాపేట బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మంత్రి జగదీశ్ రెడ్డి నామినేషన్ వేశారు. ఇవాళ ఉదయం సూర్యాపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగదీశ్ రెడ్డి 2001లో రాజకీయ ప్రవేశం చేసిన.. బీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అధికార ప్రతినిధి, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా విధులు నిర్వహించారు. ఇక, 2014లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా జగదీశ్ రెడ్డి విజయం సాధించారు. ఎస్సీ అభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2018లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం విద్యుత్ శాఖ మంత్రిగా జగదీశ్ రెడ్డి కొనసాగుతున్నారు.