ఈటలపై హరీష్‌రావు ఫైర్.. కేసీఆర్‌కు గోరి కడతావా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి, హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై మరోసారి ఫైర్ అయ్యారు మంత్రి హరీష్‌రావు.. జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో గెల్లు శ్రీనివాస్ ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇళ్లు ఎలా వస్తాయి? గెల్లు శీను గెలిస్తే వస్తాయా..? ఈటల గెలిస్తే వస్తాయా? ఒక్కసారి ఆలోచించాలన్నారు.. గెల్లు సీను గెలవడం ఖాయం ఇక్కడ ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తామన్న ఆయన.. గొంతు బిగ్గరగా చేసుకొని పెద్దగా మాట్లాడిన జూట మాటలు మాట్లాడిన ధర్మం ధర్మమే అవుతుందన్నారు.. గ్రామాలలో నన్ను చూసే ఇవన్నీ పనులు అవుతున్నాయని చెబుతున్నావు.. ఆనాడు రైతు బంధు ఎవరిని చూసి వచ్చింది, కల్యాణ లక్ష్మి ఎవరిని చూసి వచ్చింది చెప్పు రాజేంద్ర అంటూ ప్రశ్నించారు. నువ్వు పని చేయకనే హుజురాబాద్ వెనుకబడ్డది కనుకనే మిగిలిపోయేనవి పనులను మేం చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఆరుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే నీవ్వు కేసీఆర్ కు గోరి కడతావా…? అంటూ ఈటలపై ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్‌రావు.. తమ్ముడు, కుడిభుజం అన్న.. కేసీఆర్ ను తిడుతున్నాడు… ఫిర్యాదు చేసి బతుకమ్మ చీరెలు రాకుండా చేశారని మండిపడ్డారు. ఇక, వచ్చే ఫిబ్రవరి, మార్చి నాటికి రైతులకు మిత్తితో సహా లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ఆయన.. టీఆర్ఎస్ పార్టీ రైతుబంధు కార్డు రైతు భీమా కార్డు ఇస్తే.. బీజేపీ వాళ్లు రైతులపై కార్లు ఎక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. నిన్నటి వరకు బీజేపీని తిట్టిన నువ్వు బీజేపీ వద్దంటివి కేసీఆర్ ముద్దంటివి.. ఇప్పుడు బీజేపీలో చేరి బీజేపీ ముద్దు అంటున్నావ్.. కేసీఆర్ కు గోరి కడుతా అంటున్నావు.. ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నావు.. ఎవరు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నది అంటూ నిలదీశారు హరీష్‌రావు.
Also Read
- Hyderabad: తెలంగాణలో ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలపై కొరడా.. 32 మెడికల్ షాపులకు నోటీసులు
- Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
- GITAM University: గీతం యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం.. ఈగిల్ ఫోర్స్ విచారణ
- Cyberabad Traffic Plan: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌కు చెక్.. సైబరాబాద్ పోలీసుల కొత్త ప్లాన్
తాజావార్తలు
-
Hyderabad: తెలంగాణలో ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలపై కొరడా.. 32 మెడికల్ షాపులకు నోటీసులు
-
Kumar Sangakkara: విమానాశ్రయంలో వివక్ష.. సంగక్కర సంచలన ఆరోపణలు!
-
Rudravanam PS: మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. అక్టోబర్ 30 నుంచి ‘రుద్రవనం పీఎస్’ స్ట్రీమింగ్.!
-
Amazon Layoffs 2026: అమెజాన్‌లో మరోసారి ఉద్యోగాల కోత.. పొద్దు పొద్దున్నే 250 మంది ఉద్యోగులకు షాక్!
-
WPL 2027 Auction: వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌కు అత్యధిక ధర.. సోఫీ మోలినెక్స్ను సొంతం చేసుకున్న యూపీ వారియర్స్..
ట్రెండింగ్
-
RCB Full Squad: నలుగురు కొత్త ప్లేయర్లు, స్టార్ ఆల్‌రౌండర్లు.. ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
Apple మొట్టమొదటిసారిగా టచ్‌స్క్రీన్ సదుపాయం.. PROLED XDR డిస్ప్లే, M5 ప్రాసెసర్లతో MacBook Pro లాంచ్..
-
Less Oil Cooking: తక్కువ నూనెతో రుచికరమైన వంటలు.. అడుగు అంటకుండా ఉండే స్మార్ట్ చిట్కాలు ఇవే..